News May 1, 2024
నేతలారా.. ఉద్యోగాలు, ధరల గురించి మాట్లాడండయ్యా!

దేశంలోని ప్రజలు నిరుద్యోగం, ధరల పెరుగుదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాలు సైతం లేఆఫ్‌ల పేరుతో ఊడిపోతున్నాయి. అయితే.. ధరలు తగ్గింపు, ఉద్యోగాల సృష్టి గురించి చెప్పకుండా.. నేతలు ప్రచారంలో హిందూ-ముస్లిం అంటూ మతపరమైన విమర్శలు చేసుకుంటున్నారు. BJP రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ అంటే.. కాంగ్రెస్ వస్తే ముస్లింలకే మేలని BJP అంటోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News December 17, 2025
సూర్య నమస్కారాల్లో 108 విశిష్టత..

సూర్య నమస్కారాన్ని 9 సార్లు ఆచరిస్తే.. ఎంతో ప్రయోజనం ఉంటుందని నమ్ముతారు. అలాగే ఒక్క సూర్య నమస్కారంలో 12 భంగిమలు ఉంటాయి. అలా.. 12 భంగిమలు * 9 సూర్య నమస్కారాలు = 108 అవుతుంది. ఈ సాధన మన మనసు, శరీరం ప్రకృతితో సమానంగా ఒకే తాటిపై నడిచేలా చేసి, ప్రశాంతంగా, శక్తివంతంగా ఉండేందుకు సహాయపడుతుందట. శ్వాస వ్యాయామాలు, ఇతర ఆసనాలను 108 సార్లు సాధన చేయడం ఎంతో ముఖ్యమంటున్నారు పండితులు.
News December 17, 2025
AIIMS నాగపూర్‌లో ఉద్యోగాలు

<
News December 17, 2025
రబీ పంటల డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం

AP: రాష్ట్రంలో రబీ సీజన్‌కు సంబంధించి డిజిటల్ క్రాప్ సర్వే నేటి నుంచి ప్రారంభమైంది. రబీ సీజన్‌లో అన్ని రకాల పంటలతో పాటు అన్నిరకాల భూ కమతాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. పంటల నమోదుకు గరిష్ట స్థాయి 20 మీటర్ల దూరం మాత్రమేనని స్పష్టం చేశారు. ఫార్మర్ యూనిక్ ఐడీ నమోదుకాని రైతుల వివరాలను వెంటనే నమోదు చేయించాలని సూచించారు.


