News November 14, 2025
Leading: ఎన్డీయే డబుల్ సెంచరీ

బిహార్‌లో అద్వితీయ విజయం దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది. ప్రస్తుతం 200 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎంజీబీ కేవలం 37 స్థానాల్లోపే లీడ్‌లో ఉంది. మరోవైపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. ఆ పార్టీ 91 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. జేడీయూ 81, ఆర్జేడీ 28 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.
Similar News
News November 14, 2025
అనుమతుల్లేని ప్లాట్ల యజమానులకు మరో అవకాశం

AP: లే అవుట్ల రెగ్యులరైజేషన్ స్కీమ్ గడువును GOVT 2026 JAN 23 వరకు పొడిగించింది. ప్లాట్ల యజమానులు LTP ద్వారా పీనలైజ్, ఇతర ఛార్జీలు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. గడువులోగా దరఖాస్తు చేస్తే ఓపెన్ ప్లేస్ ఛార్జీల్లో 50% రాయితీ ఇస్తారు. ఈ అవకాశం మళ్లీ ఉండకపోవచ్చంటున్నారు. కాగా రెగ్యులర్ కాని PLOTSలో నిర్మాణాలకు అనుమతివ్వరు. నిర్మాణాలున్నా తొలగిస్తారు. రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధిత జాబితాలో చేరుస్తారు.
News November 14, 2025
హనుమాన్ చాలీసా భావం – 9

సూక్ష్మరూప ధరి సియహి దిఖావా | వికటరూప ధరి లంక జరావా || సీతమ్మను కలుసుకోవడానికి, హనుమంతుడు సూక్ష్మరూపం ధరించి, వినయంగా వెళ్లాడు. కానీ, లంకకు బుద్ధి చెప్పడానికి, రాక్షసులను భయపెట్టడానికి భయంకరమైన రూపం ధరించి లంకను దహనం చేశాడు. మనం చేసే పనిని బట్టి, ఆ అవసరాన్ని బట్టి మన శక్తిని, విధానాన్ని మార్చుకోవాలి. వినయంతో కూడిన బుద్ధి, ధైర్యంతో కూడిన శక్తి రెండూ విజయానికి అవసరం.<<-se>>#HANUMANCHALISA<<>>
News November 14, 2025
24,729 ఓట్ల మెజారిటీతో న’విన్’

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా విజయం సాధించినట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఆయనకు కౌంటింగ్ కేంద్రంలో ధ్రువీకరణ పత్రం అందజేశారు. నవీన్‌కు 98,988 ఓట్లు పోలవగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259, బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి. బీజేపీ డిపాజిట్ గల్లంతయ్యింది.


