News August 24, 2024
టూత్ బ్రష్‌లను బాత్‌రూమ్‌లో పెడుతున్నారా?

టూత్ బ్రష్‌లను బాత్‌రూమ్‌లో ఉంచడం ఆరోగ్యానికి ప్రమాదం కావొచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్నానాలగదిలో తేమ, వేడి కలగలిపిన వాతావరణం బ్యాక్టీరియా పెరగడానికి అనువైనదని పేర్కొంటున్నారు. ‘కమోడ్ ఫ్లష్ చేసినప్పుడు అందులో బ్యాక్టీరియా గాల్లో చేరి బ్రష్ మీదకు వచ్చే ప్రమాదమూ ఉంది. అందువల్ల బ్రష్‌ను బాత్‌రూమ్ బయట పొడి వాతావరణంలో దుమ్ము లేని చోట పెడితే మంచిది’ అని పేర్కొంటున్నారు.
Similar News
News January 19, 2026
CMERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (<
News January 19, 2026
YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.
News January 19, 2026
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్‌డ్‌గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.


