News March 27, 2024

అసత్య ప్రచారాలను అడ్డుకుందాం

image

Way2News లోగోతో కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మీరు ఈ ఫేక్ ఉచ్చులో పడకుండా, ఇతరులూ మోసపోకుండా ఆపడం చాలా సులువు. మా ప్రతి ఆర్టికల్‌కు ప్రత్యేక కోడ్ ఉంటుంది. Way2News పేరుతో స్క్రీన్ షాట్ వస్తే అందులోని కోడ్‌ను fc.way2news.comలో ఎంటర్ చేయండి. మీకు వచ్చిన స్క్రీన్‌షాట్ వార్త కన్పిస్తే ఆ పోస్టు మేము పబ్లిష్ చేశామని అర్థం. ఆ వార్త రాలేదంటే మీకు ఫేక్ స్క్రీన్‌షాట్ వచ్చిందని గ్రహించాలి.

Similar News

News February 10, 2026

వంట చేస్తూ మాట్లాడుతున్నారా?

image

వంట చేయడం ధ్యానం వంటిది. ఇది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. అందుకే ఆహారం వండేటప్పుడు మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. టీవీ చూస్తూనో, ఫోన్ మాట్లాడుతూనో వంట చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది. మౌనంగా చేస్తే వంటకాలు మరింత రుచికరంగా తయారవుతాయని నమ్మకం. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రశాంతంగా, ఏకాగ్రతతో వంట చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News February 10, 2026

రేపు ఉద్యోగులకు సెలవు

image

TG: రేపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులకు రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఊరటనిచ్చింది. మున్సిపల్, కార్పొరేషన్లలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ‘స్పెషల్ క్యాజువల్ లీవ్’ మంజూరు చేసింది. సెలవు లేదనే కారణంగా ఓటుకు దూరం కావొద్దని ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇప్పటికే <<19099000>>సెలవు<<>> ఇచ్చిన విషయం తెలిసిందే.

News February 10, 2026

అల్లు అర్జున్‌ 42 రూల్స్ అంటూ ప్రచారం.. AA టీమ్ సీరియస్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై బ్రాండ్ స్ట్రాటజిస్ట్ <<19101939>>కావేరీ బారువా<<>> చేసిన వ్యాఖ్యలపై AA టీమ్ స్పందించింది. ‘ఇటీవల అల్లు అర్జున్‌పై చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. ఈ ఆరోపణలను మేము సీరియస్‌గా తీసుకున్నాం. బాధ్యులపై పరువునష్టం దావా వేసేందుకు మా లీగల్ టీమ్ సిద్ధమవుతోంది. ఇలాంటి ధ్రువీకరించని సమాచారాన్ని షేర్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం’ అని ప్రకటన విడుదల చేసింది.