News April 14, 2025
ఏపీలో రూ.5,001 కోట్లతో LG కొత్త ప్లాంట్!

AP: తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో LG కంపెనీ కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. మే 8న దీని ఓపెనింగ్ సెర్మనీ ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం గతేడాది NOVలో 247 ఎకరాలను కేటాయించింది. రూ.5,001 కోట్ల పెట్టుబడులను ఆమోదించింది. ఈ ప్లాంటులో ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, కంప్రెషర్లను తయారు చేయనున్నారు. 1,495 మంది స్థానికులకు ప్రత్యక్ష ఉపాధి కల్గనుంది.
Similar News
News January 13, 2026
జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు: SP

సంక్రాంతి పండుగ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో జుదాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. కోడిపందేలు, పేకాట, గుండాట, జూదక్రీడలు నిర్వహిస్తే కఠినశిక్షలు తప్పవన్నారు. పందేలకోసం స్థలాలు ఇచ్చిన యజమానులను కూడా నిందితులుగా పరిగణించి కేసు నమోదు చేస్తామన్నారు. పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు, పాస్‌పోర్ట్ రావడం కష్టమన్నారు.
News January 13, 2026
కోలీవుడ్‌లో కొత్త వివాదం.. పరాశక్తి బ్యాన్‌కు కాంగ్రెస్ డిమాండ్

కోలీవుడ్‌లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శివకార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి సినిమాను బ్యాన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీలో తమ పార్టీని, నేతల్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఆయా సీన్‌లను తొలగించాలని డిమాండ్ చేసింది. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జనవరి 10న రిలీజైంది.
News January 13, 2026
వివేకా హత్య కేసులో YS సునీత మరో అప్లికేషన్

వివేకా హత్యకేసులో ఆయన కుమార్తె YS సునీత SCలో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు పాక్షికంగానే ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఆమె సవాలు చేశారు. తాము లేవనెత్తిన అంశాలకు విరుద్ధంగా HYD CBI కోర్టు పాక్షిక విచారణకు ఆదేశించినట్లు అప్లికేషన్‌లో పేర్కొన్నారు. విచారణను SC వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. కాగా CBI విచారణ కొనసాగింపుపై 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని SC గతంలోనే ట్రయల్ కోర్టును ఆదేశించింది.


