News March 24, 2024

కాసేపట్లో మద్యం దుకాణాలు బంద్

image

TG: హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినా, ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా.. కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని సూచించారు.

Similar News

News December 10, 2025

NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.

News December 10, 2025

సుందర్ పిచాయ్‌తో మంత్రి లోకేశ్ భేటీ

image

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్‌తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.

News December 10, 2025

IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>IOCL<<>>) ఈస్ట్రన్ రీజియన్‌లో 509 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి జనవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు NATS/NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:io cl.com/