News April 2, 2024
సూర్య గ్రహణం రోజున జైళ్లలో లాక్‌డౌన్.. ఖైదీల దావా

సంపూర్ణ <<12895461>>సూర్యగ్రహణం<<>> సందర్భంగా ఈ నెల 8న USలోని జైళ్లలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ రోజు కొన్ని నిమిషాలు పూర్తి చీకటిగా ఉంటున్నందున ఖైదీల సందర్శనను నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు. తమకు పవిత్రమైన రోజున మతపరమైన కార్యక్రమాలను నిరోధించడంతో తమ హక్కులకు భంగం కలుగుతోందని పలువురు ఖైదీలు న్యూయార్క్ కోర్టులో దావా వేశారు. దీనిపై త్వరలో విచారణ జరగనుంది.
Similar News
News February 13, 2026
సంచలనం.. ఓటుకు రూ.70,000?

TG: రంగారెడ్డి(D) మొయినాబాద్ మున్సిపాలిటీలోని ఓ వార్డు ఎన్నిక సంచలనంగా మారింది. కౌన్సిలర్ పదవి కోసం పోటీ చేసిన ఓ అభ్యర్థి ఓటుకు ₹70K, 25KGల బియ్యం, 15 లీటర్ల వంట నూనె, పట్టుచీర పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ₹7Cr ఖర్చు చేశారని టాక్. అదే వార్డులో మరో అభ్యర్థి కూడా ఓటుకు ₹40K పంచినట్లు స్థానికులు చెబుతున్నారు. మున్సిపాలిటీలో రియల్ ఎస్టేట్ ఊపులో ఉండటంతోనే పదవికి పోటీ ఏర్పడిందంటున్నారు.
News February 13, 2026
కొత్త హెల్త్ పాలసీ.. 12.84 లక్షల మందికి ప్రయోజనం

TG: ప్రభుత్వం తీసుకురానున్న <<19121822>>కొత్త హెల్త్ పాలసీ<<>>తో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, పెన్షనర్లు, వారి కుటుంబీకులు 12.84 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ఈ స్కీమ్ అమలు కోసం సీఎస్ ఛైర్మన్‌గా 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటుచేస్తారు. 515 ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల్లో 1,885 రకాల చికిత్సలు వ్యయపరిమితి లేకుండా అందనున్నాయి. 15 రోజుల్లో సీఎం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
News February 13, 2026
మెనోపాజ్ తర్వాత గుండె సమస్యలు

మహిళల్లో మెనోపాజ్ తర్వాత అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈస్ట్రోజెన్ తగ్గి టెస్టోస్టెరాన్ పెరగడంతో గుండెసంబంధిత సమస్యలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ హార్ట్ చెకప్స్, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. కొలెస్ట్రాల్, BP, బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. ఫైబర్, నట్స్, ఫ్రూట్స్, కూరగాయలు, చేపలు ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.


