News October 3, 2024

దేశ సంస్కృతికి మూలం శ్రీరాముడు: పవన్

image

AP: దేశ సంస్కృతికి మూలం శ్రీరామచంద్రుడని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘రాముడిని హేళన చేస్తే ప్రతిఘటించకుండా ఇంట్లో కూర్చొని ఏడుస్తాం. రాముడు ఆర్యుడు, ఉత్తరాది దేవుడనే తప్పుడు సిద్ధాంతాన్ని కొందరు ముందుకు తీసుకెళ్లారు. ఆయన నల్లని ఛాయలో ఉంటాడు. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదు. సూడో సెక్యులర్ వాదులు తమ సిద్ధాంతాలను ఇతరులపై రుద్దవద్దు’ అని అన్నారు.

Similar News

News December 11, 2025

అందుకే నరసింహ రైట్స్ అమ్మలేదు: రజినీకాంత్

image

రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘నరసింహ’ మూవీని రేపు రీరిలీజ్‌ చేస్తున్నారు. ‘సినీ కెరీర్ స్టార్ట్ అయ్యి 50 ఏళ్లు. నరసింహ రిలీజై 25 ఏళ్లు పూర్తయ్యాయి. థియేటర్లలో ఈ సినిమా చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకోవాలి. అందుకే డిజిటల్ రైట్స్ ఇవ్వలేదు’ అని సినిమా హీరో, ప్రొడ్యూసర్, రచయిత రజినీకాంత్ చెప్పారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్‌లో క్యారెక్టర్ స్ఫూర్తితో నీలాంబరి పాత్ర రాసినట్టు తెలిపారు.

News December 11, 2025

తల్లిలో ఈ లోపం ఉంటే బిడ్డకు గుండె జబ్బులు

image

కొందరు చిన్నారుల్లో పుట్టుకతోనే గుండెజబ్బులు వస్తాయి. తల్లికి ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ ఉండటం, కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తల్లిలో థయమిన్ డెఫిషియన్సీ ఉంటే బిడ్డకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. థయమిన్‌ని విటమిన్ బీ1 అని కూడా అంటారు. కాబట్టి ప్రెగ్నెన్సీలో విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

News December 11, 2025

ఓవర్‌స్పీడ్‌తోనే 1.24 లక్షల మరణాలు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి

image

2024లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.77 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 1.24 లక్షల మరణాలకు ఓవర్ స్పీడ్ కారణమన్నారు. 69,088 మంది సీట్‌బెల్ట్, హెల్మెట్ వాడకపోవడం వల్ల మరణించారని రాజ్యసభలో చెప్పారు. స్పీడ్ డ్రైవింగ్ మరణాల్లో తమిళనాడు టాప్‌లో, కర్ణాటక, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయన్నారు. 2023లో తగ్గిన మరణాలు ఈ ఏడాది మళ్లీ పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.