News May 13, 2024
సౌత్‌లో నేడే లాస్ట్

దక్షిణ భారతంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటితో పూర్తికానుంది. ఇవాళ ఏపీలో అన్ని అసెంబ్లీ (175), లోక్‌సభ (25) స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా తెలంగాణలోనూ మొత్తం 17 MP సెగ్మెంట్లలో ఓటింగ్ కొనసాగుతోంది. మిగిలిన 3 దశల్లో తూర్పు సహా దేశంలోని ఇతర భాగాల్లో, పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటింగ్ కొనసాగనుంది. సెక్యూరిటీ సిబ్బంది తరలింపు కోసం ఇలా ప్రాంతాల వారీగా దశలను ఈసీ కేటాయించింది.
Similar News
News December 9, 2025
పూజాగదిలో తప్పనిసరిగా నీళ్లు ఎందుకు ఉండాలి?

పూజా గదిలో ఏదైనా ఓ పాత్రలో నీటిని తప్పక ఉంచాలని పండితులు సూచిస్తారు. తద్వారా దేవతలు సంతృప్తి చెందుతారని అంటారు. ‘మహా నైవేద్యం కంటే కూడా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా దేవతలు ఎక్కువ సంతోషిస్తారు. రాగి చెంబులో ఉంచిన మంచి నీరు మంత్ర శక్తి చేరిన జలంతో సమానం. ఆ నీరు ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తుంది. ఈ నీటిని రెండ్రోజులకోసారి మార్చాలి. ఫలితంగా ఇంట్లో రుణ శక్తి దూరమై, దైవశక్తి పెరుగుతుంది’ అని చెబుతున్నారు.
News December 9, 2025
ఘోరం: భార్య మగ పిల్లాడిని కనలేదని..

టెక్నాలజీ ఎంత పెరిగినా కొందరిలో మూఢనమ్మకాలు పోవట్లేదు. కర్ణాటక విజయపుర(D)లో భార్య ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని ఆమెకు శిరోముండనం చేసి వెంట్రుకలను శ్మశానంలో కాల్చేశాడో భర్త. బ్లేడుతో కట్ చేయడంతో ఆమె తలకు గాయాలయ్యాయి. భార్యలో దెయ్యం ఉందని, అందుకే మగ పిల్లాడు పుట్టలేదని ఓ మంత్రగాడు చెప్పిన మాటలు నమ్మి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి భర్త డుండేశ్‌ను అరెస్టు చేశారు.
News December 9, 2025
బెస్ట్ రైస్ డిష్‌లో హైదరాబాద్ బిర్యానీ సత్తా

ప్రపంచ ప్రఖ్యాత ఆహార రేటింగ్ సంస్థ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన 2026 ‘బెస్ట్ ఫుడ్’ జాబితాలో హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. టాప్ 100 డిషెస్ జాబితాలో 72వ స్థానంలో నిలిచిన హైదరాబాదీ బిర్యానీ, ప్రపంచంలోని టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్‌లో 10వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. సువాసనభరితమైన బాస్మతి రైస్, మసాలాలు హైదరాబాదీ బిర్యానీకి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.


