News March 6, 2025
నేడు మద్యం దుకాణాలకు లాటరీ

AP: రాష్ట్రంలో గీత కార్మికులకు కేటాయించిన మద్యం దుకాణాలకు ఇవాళ లాటరీ ప్రక్రియ నిర్వహించనున్నారు. 15 జిల్లాల్లో 227 దుకాణాలకు లాటరీ తీయనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని షాపులకు లాటరీ నిర్వహించి లైసెన్సులు మంజూరు చేయనున్నారు. కాగా ఇప్పటికే 10 జిల్లాల్లో లాటరీ తీశారు.
Similar News
News December 13, 2025
మెస్సీ మ్యాచ్.. 3,000 మంది పోలీసులతో భద్రత

HYD ఉప్పల్ స్టేడియంలో ఈరోజు రా.7.30 గంటలకు జరిగే రేవంత్vsమెస్సీ ఫుట్‌బాల్ మ్యాచుకు టికెట్ ఉన్న వారినే అనుమతించనున్నారు. ఈ మ్యాచుకు 3,000 మంది పోలీసులతో భారీ భద్రత కల్పిస్తున్నట్లు రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. 450 CC కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షించనున్నారు. 20ని.ల పాటు జరిగే ఈ ఫ్రెండ్లీ మ్యాచులో CM రేవంత్ ‘సింగరేణి RR9’ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. మ్యాచ్ తర్వాత మెస్సీతో పెనాల్టీ షూటౌట్ ఉంటుంది.
News December 13, 2025
కాకినాడ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 13, 2025
టెన్త్ అర్హతతో 714 పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ 714 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి JAN 15 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఉత్తీర్ణత, 18-27 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం ₹18,000-₹56,900 వరకు చెల్లిస్తారు.
వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/


