News August 13, 2025

LRS సద్వినియోగం చేసుకోండి : కలెక్టర్

image

జూన్ 30, 2025 కంటే ముందు అనధికారంగా ఏర్పాటైన లేఅవుట్లు, ప్లాట్లను చట్టబద్ధంగా క్రమబద్ధీకరించే సువర్ణ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని మండల తహశీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు, నుడా (NUDA) కార్యాలయాలను సంప్రదించాలన్నారు. http://apdpms.ap.gov.in/ లేదా http://nudaap.org/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News March 10, 2026

25,305 మంది ఆడపిల్లలకు HPV వ్యాక్సిన్: DMHO

image

జిల్లాలోని 52 PHC, 29 పట్టణ PHCలు, 10 CHCలతోపాటు GGH ఆత్మకూరు, కావలి, గూడూరు ఏరియా ఆసుపత్రులలోనూ ఈ HPV వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నట్లు DMHO సుజాత తెలిపారు. ఉచితంగా వేసే ఈ HPV వ్యాక్సిన్‌ను ఎంపిక చేసిన ఆడపిల్లలకు 0.5 ml డోస్‌ను బుధవారం నుంచి ఇవ్వననున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 14 ఏళ్లు పైడి 15 ఏళ్లలోపు ఆడపిల్లలు 25,305 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు.

News March 10, 2026

నెల్లూరు: జిల్లాకు చేరుకున్న HPV వ్యాక్సిన్

image

గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు ముందస్తుగా వేసే వ్యాక్సిన్ HPV జిల్లాకు చేరినట్లు DMHO సుజాత తెలిపారు. 14 సం.లు పైబడి 15 ఏళ్లలోపు ఉన్న ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ వేస్తారు. రూ.4వేలు విలువ చేసే HPV(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ మొదటి విడతగా 8,939 డోసులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చేరుకున్నాయన్నారు. రేపటి నుంచి ఉచితంగా ఆడపిల్లలకు పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు.

News March 10, 2026

స్వచ్ఛ విద్యాలయాల సర్టిఫికేట్లు అందజేసిన కలెక్టర్

image

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛహరిత విద్యాలయంలో భాగంగా జిల్లాలోని అన్నీ పాఠశాలలను పరిశీలించారు. ఇందులో భాగంగా నీటి వసతి, మరుగుదొడ్ల పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్, పాఠశాలలో చెట్ల పెంపకం వంటి కార్యక్రమాలను సర్వే చేసి మొత్తం 8 ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ 8 ఉత్తమ పాఠశాలల HMలకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు.