News April 12, 2024
టాస్ గెలిచిన లక్నో..

ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
లక్నో: డికాక్, KL రాహుల్, పడిక్కల్, స్టోయినిస్, పూరన్, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్
ఢిల్లీ: పృథ్వీ షా, వార్నర్, హోప్, రిషబ్ పంత్, స్టబ్స్, అక్షర్ పటేల్, మెక్‌గర్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్
Similar News
News December 12, 2025
అన్ని మతాలకు వాస్తు వర్తిస్తుందా?

వాస్తు ఓ మతానికే పరిమితం కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘వాస్తు పంచభూతాల కలయికపై ఆధారపడిన శాస్త్రం. మతాలు, కులాలు మనుషులు ఏర్పరచుకున్నవే. పంచభూతాలు మతాలకు అతీతమైనవి కాబట్టి వాస్తు కూడా అతీతమే అవుతుంది. మనం నివసించే ఇంట్లో ఇవి సక్రమంగా, సమతుల్యంగా ఉన్నప్పుడే జీవితం సవ్యంగా, ఆరోగ్యంగా సాగుతుంది. లేకపోతే ఆ దుష్ఫలితాలు అందరికీ ఒకేలా ఉంటాయి. వాస్తు అందరికీ అవసరం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 12, 2025
2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు

AP: గోదావరి నదీ పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. 12 రోజుల పాటు ఇవి కొనసాగుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. TTD ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు ఎండోమెంటు కమిషనర్ పుష్కర పుణ్య దినాలపై నివేదిక అందించారు. ఈమేరకు ప్రభుత్వం అధికారికంగా గోదావరి పుష్కర తేదీలను ప్రకటించింది. 2027 జులై 7వ తేదీవరకు ఇవి కొనసాగుతాయని పేర్కొంది.
News December 12, 2025
వారికి ఇంటర్ ఎగ్జంప్షన్ పేపర్‌కు మార్కులు

AP: ఇంటర్ EXAMSలో దివ్యాంగులు ఎగ్జంప్షన్ పొందిన పేపర్‌కు ఇకపై సగటు MARKS ఇస్తారు. ఈమేరకు GO విడుదలైంది. వీరు 2 లాంగ్వేజ్ పేపర్లలో 1 రాస్తే చాలన్న రూలుంది. 5 పేపర్లలో 4కి MARKS వేసి మినహాయింపు పేపర్‌కు ‘E’ అని సర్టిఫికెట్లో పొందుపరుస్తున్నారు. అయితే ఈ సర్టిఫికెట్లపై IIT, NITలు అడ్మిషన్లు నిరాకరిస్తుండడంతో దివ్యాంగులు ఇబ్బంది పడగా గతేడాది లోకేశ్ జోక్యంతో సీట్లు దక్కాయి. ఇపుడన్నిటికీ MARKS ఇస్తారు.


