News June 19, 2024
మా జోలికొస్తే ఖబడ్దార్: కిమ్-పుతిన్ జోడీ
తమ రెండు దేశాల్లో దేనిపై దాడి చేసినా ఊరుకోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఉత్తర కొరియా పర్యటనలో ఉన్న పుతిన్ పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. భద్రత, అంతర్జాతీయ సమస్యలు, ఆరోగ్యం, వైద్య విద్య, సైన్స్ విభాగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. కాగా 24 ఏళ్ల తర్వాత పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించడం విశేషం.
Similar News
News September 9, 2024
రేపు వర్షాలు ఉన్నాయా?
రేపు ఉ.8.30 గంటల వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ADB, నిర్మల్, NZB, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. HYD సహా మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు ఏపీలో శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, తూ.గో. జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
News September 9, 2024
GST కౌన్సిల్ భేటీలో ఏపీ ప్రతిపాదనలివే
AP: GST కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పలు ప్రతిపాదనలు చేశారు.
✒ ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ సేవలపై GSTని తీసేయాలి.
✒ మద్యం తయారీలో వాడే ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌ను వ్యాట్ పరిధిలోకి తేవాలి.
✒ ఎలక్ట్రిక్ వెహికల్స్ విడి భాగాలపై GSTని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలి.
✒ విద్యాసంస్థలు, వర్సిటీల్లో టెక్నాలజీని ప్రోత్సహించేందుకు వచ్చే గ్రాంట్లపై పన్నును తొలగించాలి.
News September 9, 2024
బాహుబలి-2, పఠాన్ రికార్డులు బ్రేక్ చేసిన ‘స్త్రీ-2’
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘స్త్రీ-2’ సినిమా జోరు కొనసాగుతోంది. హిందీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల జాబితాలో రెండో స్థానానికి చేరింది. రూ.584 కోట్లతో జవాన్ అగ్రస్థానంలో ఉండగా, స్త్రీ-2(రూ.551 కోట్లు) సెకండ్ ప్లేస్‌లో ఉంది. త్వరలోనే నంబర్-1కు చేరే అవకాశం ఉంది. 3, 4, 5 స్థానాల్లో గదర్-2(రూ.527 కోట్లు), పఠాన్(రూ.524 కోట్లు), బాహుబలి-2(రూ.511 కోట్లు) ఉన్నాయి.