News March 28, 2024

నేడు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

image

TS: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. నేటి ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. 1439 ఓటర్ల కోసం జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వచ్చే నెల 2న ఓట్లు లెక్కిస్తారు.

Similar News

News February 18, 2026

ప్రభుత్వ ఆఫీసులలో AC ఉష్ణోగ్రతపై పరిమితి

image

TG: ప్రభుత్వ ఆఫీసులలో ACలను కనిష్ఠంగా 25డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం పరిమితి విధించింది. ఇంధన పొదుపుతో పాటు బిల్లుల భారాన్ని తగ్గించేందుకు ఈ ఆదేశాలు ఇచ్చింది. దీన్ని తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొంది. ఇప్పటికే ఆఫీసులు, స్కీముల విద్యుత్ బిల్లులు కొండల్లా పేరుకుపోయాయి. కొన్నేళ్లుగా డిస్కమ్‌లకు వీటి నుంచి రావాల్సిన బకాయి ₹48వేల CR వరకు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

News February 18, 2026

ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

AP: పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 14 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి DMHO దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ అర్హతతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన మహిళలు ఫిబ్రవరి 20వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ప్రొవిజినల్ లిస్ట్‌ను ఫిబ్రవరి 23న ప్రకటిస్తారు. వయసు 25నుంచి 45 ఏళ్ల మధ్య ఉండి, స్థానికంగా నివాసం ఉండాలి. వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/

News February 18, 2026

టెన్త్ అర్హతతో 28,636 ఉద్యోగాలు.. BIG UPDATE

image

ఇండియా పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 28,636 GDS పోస్టులకు ఈ నెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీటిలో TGలో 608, APలో 1060 ఖాళీలున్నాయి. తాజాగా అప్లికేషన్ల సవరణకు అవకాశం కల్పిస్తూ పోస్టల్ శాఖ కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది. అభ్యర్థులు రేపు సా.5 గంటల వరకు దరఖాస్తులను <>https://www.indiapost.gov.in/<<>> సైట్‌లో ఎడిట్ చేసుకోవచ్చు.