News March 27, 2024

రేపు మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక

image

TG: రేపు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. ఇందుకోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, BRS నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.

Similar News

News February 19, 2026

ఛత్రపతి: వీరత్వ పతాక.. ధీరత్వ ప్రతీక

image

శివాజీ చక్రవర్తి.. ఈ పేరు వింటే శత్రువులపై విరుచుకుపడిన వీరత్వం, రాజ్యాలను జయించిన ధీరత్వం గుర్తొస్తాయి. మొఘలులు, దక్కన్ సుల్తానుల మధ్య నలిగే ప్రజలకు విముక్తి కలగాలన్న తల్లి జిజియాబాయి మాటలతో రాజ్య స్థాపనపై బాల్యంలోనే కలగన్నారు. తల్లి నేర్పిన పురాణ గాథల బోధనల బుద్ధితో పాటు యుద్ధ విద్యలతో పరాయి పాలనలోని కోటలను బద్దలు కొట్టి మహారాష్ట్రలో మరాఠా జెండా ఎగురవేశారు. ఆ ఛత్రపతి జయంతి నేడు (19 feb 1630).

News February 19, 2026

అభి‘షేక్’ ఆడిస్తాడనుకుంటే..

image

భారత స్టార్ ప్లేయర్ అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తున్నారు. టన్నుల కొద్దీ రన్స్ చేస్తారనుకుంటే <<19177966>>డకౌట్లతో<<>> రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ WCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ ఖాతా కూడా తెరవలేదు. నిన్నటి మ్యాచ్‌లో సిరాజ్ జెర్సీతో బ్యాటింగ్‌కు వచ్చినా ఫలితం మారలేదు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌పై ఒత్తిడి పడుతోంది. అభిషేక్ ఫామ్‌లోకి రాకపోతే సూపర్-8 మ్యాచుల్లో టీమ్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది.

News February 19, 2026

మారే ప్రమాణాలు- మున్ముందు ప్రమాదాలు

image

నీట్ PGలో 0 మార్కుల అభ్యర్థులకూ అడ్మిషన్ రావడం ఆందోళనకరం. సీట్లు భర్తీ చేయడం, డాక్టర్ల కొరత తీర్చేందుకు ఇలా మార్కులు తగ్గించి అడ్మిషన్లు ఇవ్వడంపై మెడికల్ బాడీస్ సైతం అభ్యంతరం తెలిపాయి. ఇది ఫ్యూచర్‌లో భారత ఆరోగ్య రంగాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యగా అభివర్ణించాయి. అవసరమైతే స్టూడెంట్స్‌కు ట్రైనింగ్, ఫీజు మినహాయింపు, ఇన్సెంటివ్స్ లాంటివి ఇవ్వాలి తప్ప ఇదేం నిర్ణయమని సగటు మనిషి అభిప్రాయం. మీరేమంటారు..?