News June 18, 2024
మూడో స్థానానికి ఎగబాకిన మంధాన

భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 3వ స్థానానికి ఎగబాకారు. సౌతాఫ్రికాతో తొలి వన్డేలో సెంచరీ బాదిన ఆమె ఇంటర్నేషనల్ కెరీర్‌లో 7,000 పరుగుల మైలురాయి చేరుకున్నారు. ఈక్రమంలో 715 పాయింట్లతో వన్డే బ్యాటర్ల ర్యాకింగ్స్‌లోనూ పైకి దూసుకెళ్లారు. ఈ జాబితాలో 772 పాయింట్లతో బ్రంట్(ఇంగ్లండ్), 768 పాయింట్లతో ఆటపట్టు(శ్రీలంక) తొలి 2 స్థానాల్లో ఉన్నారు.
Similar News
News January 19, 2026
ట్రంప్‌కు ఈయూ షాక్ ఇవ్వనుందా..!

గ్రీన్‌లాండ్ డీల్‌ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్ <<18885220>>విధించడాన్ని<<>> యూరోపియన్ యూనియన్ (EU) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీకార సుంకాలు విధించాలని భావిస్తోంది. ఈయూ చరిత్రలో తొలిసారిగా ‘ట్రేడ్ బజూకా’ను ప్రయోగించాలని ప్లాన్ చేస్తోంది. దీనికి అదనంగా 93 బిలియన్ యూరోల(రూ.9.8 లక్షల కోట్లు) ప్రతీకార టారిఫ్స్ విధించడాన్ని ఈయూ పరిశీలిస్తోందని రాయిటర్స్ ఏజెన్సీ తెలిపింది.
News January 19, 2026
అసలేంటీ ‘ట్రేడ్ బజూకా’!

తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు 2023లో ‘ట్రేడ్ బజూకా’(బెదిరింపుల వ్యతిరేక సాధనం-ACI)ను EU అమల్లోకి తెచ్చింది. ఇతర దేశాల ఆర్థిక బెదిరింపులు, బలవంతపు వాణిజ్య పద్ధతుల నుంచి తమ రక్షణ కోసం రూపొందించింది. కౌంటర్ టారిఫ్స్, దిగుమతులపై ఆంక్షలు, యూరోపియన్ మార్కెట్లలోకి ఆయా దేశాల యాక్సెస్‌ను, పెట్టుబడులను నియంత్రించడం, కాంట్రాక్టుల్లో పాల్గొనకుండా బ్లాక్ చేయడం వంటి పవర్స్ దీనికి ఉంటాయి.
News January 19, 2026
ఐఐటీ ఢిల్లీలో పోస్టులు

<


