News November 17, 2025

MANITలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

మౌలానా అజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MANIT)లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఈ నెల 27వరకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. ME, M.Tech, M.Arch, మాస్టర్ ఆఫ్ డిజైన్‌తో పాటు సంబంధిత విభాగంలో PhD పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1500. వెబ్‌సైట్: https://www.manit.ac.in

Similar News

News January 24, 2026

వసతి గృహాల్లో సౌకర్యాలపై కలెక్టర్ ఆదేశం

image

కర్నూలు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులపై కలెక్టర్ డా.ఏ.సిరి సమీక్షించారు. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాల మరమ్మతులకు వెంటనే ఎస్టిమేట్లు పంపాలని అధికారులను ఆదేశించారు. వారం వారం హాస్టళ్లను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని సూచించారు. నెల రోజుల్లోపు అన్ని వసతి గృహాల్లో విద్యార్థుల కోసం దోమల తెరలు ఏర్పాటు చేయాలని ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News January 24, 2026

లక్ష్యాలను సాధించి ‘ఎ’ గ్రేడ్ పొందాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల్లో ‘బి’, ‘సి’ గ్రేడ్లలో ఉన్న శాఖలు తమ పనితీరును మెరుగుపరుచుకుని ‘ఎ’ గ్రేడ్ సాధించాలని కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. శుక్రవారం నంద్యాల కలెక్టరేట్‌లో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో అధికారులు అలసత్వం వహించకూడదని, ప్రగతి సూచికల్లో వెనుకబడిన శాఖలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.