News March 10, 2025
మార్చి 10: చరిత్రలో ఈ రోజు

*1876: అలెగ్జాండర్ గ్రాహం బెల్ విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు
*1896: రంగస్థల నటుడు నిడుముక్కల సుబ్బారావు జననం
*1897: సావిత్రిబాయి ఫూలే మరణం
*1982: ప్రముఖ వైద్యుడు జి.ఎస్.మేల్కోటే మరణం
*1990: సినీ నటి రీతూ వర్మ జననం
*అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవం
Similar News
News January 20, 2026
ఏప్రిల్ 20న సింహాచలం చందనోత్సవం

సింహాచలంలో ఈఏడాది ఏప్రిల్ 20న లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం జరగనుంది. సంబంధిత ఏర్పాట్లపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జేసీ, సీపీ, జీవీఎంసీ కమిషనర్, దేవస్థానం ఈవో ఉన్నారు.
News January 20, 2026
50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం: CBN

AP: టెక్నాలజీ సహా వివిధ రంగాల్లోని మార్పులకు అనుగుణంగా పాలసీలు రూపొందిస్తామని CBN పేర్కొన్నారు. ‘దావోస్ సదస్సులో ప్రముఖుల ఆలోచనలతో రాష్ట్రాన్ని బిజినెస్ ఫ్రెండ్లీగా మారుస్తాం. అగ్రి, మెడికల్ రంగాల్లో డ్రోన్లను వినియోగిస్తాం. 2026లో డ్రోన్ అంబులెన్స్ లాంచ్ చేసే ఆలోచన ఉంది. 50L ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టాలని లక్ష్యం పెట్టుకున్నాం’ అని దావోస్‌లో CII బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో CM పేర్కొన్నారు.
News January 20, 2026
హైదరాబాద్‌లో 80 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

HYDలోని CSIR-CCMB 80 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు JAN 27 -FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 2 వరకు పోస్ట్ చేయవచ్చు. టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్‌కు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 30ఏళ్లు. టెక్నీషియన్‌కు నెలకు రూ.39,545, tech. assist.కు రూ.72,240, tech. ఆఫీసర్‌కు రూ.90,100 చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.ccmb.res.in/


