News March 27, 2024

మార్చి 27: చరిత్రలో ఈరోజు

image

1845: ఎక్స్ రే ఆవిష్కర్త కన్రాడ్ రాంట్జెన్ జననం
1868: మైసూరు మహారాజా ముమ్మడి క‌ృష్ణరాజ్ వడయార్ మరణం
1898: భారత విద్యావేత్త సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణం
1903: తెలుగు సినీ దర్శకుడు హెచ్‌వీ బాబు జననం
1968: రోదసిలోకి వెళ్లిన తొలి మనిషి యూరీ గగారిన్ మృతి
1985: నటుడు రామ్ చరణ్ జననం
1998: నరాల బలహీనతకు ఔషధంగా వయాగ్రాకు ఆమోదం
☞ నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం

Similar News

News February 11, 2026

అజిత్ విమాన ప్రమాదం వెనుక కుట్ర: రోహిత్

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన <<18980385>>ప్రమాదం<<>> వెనుక కుట్ర దాగి ఉందని ఆయన మేనల్లుడు, NCP(SP) MLA రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారు. ‘ముందు రోజే అజిత్ బారామతికి వెళ్లాల్సి ఉండగా అనుకోకుండా షెడ్యూల్ మారే పరిస్థితులు వచ్చాయి. విమానంలో సాంకేతిక తనిఖీలు సరిగ్గా జరిగాయా? పైలట్ కపూర్ గతంలో డ్రంకెన్ పైలట్ లిస్ట్‌లో ఉన్నారని, ప్రయాణానికి ముందు బ్రీత్ అనలైజర్ టెస్టులు జరిగాయా’ అని ప్రశ్నలు లేవనెత్తారు.

News February 11, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 11, 2026

సామాజిక కార్యకర్తలకు సన్మానం చేసిన అర్జున్

image

నటుడు అర్జున్ ‘సీతాపయనం’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో తన గొప్ప మనసు చాటుకున్నారు. ముగ్గురు సామాజిక కార్యకర్తలను ఆయన వేదికపై సన్మానించారు. ట్యాంక్ బండ్ శివ, ప్రకృతి ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణ, వైద్యులు, సంఘ సేవకులు ప్రకాశ్ ఆమ్టే దంపతులకు రూ.లక్ష చొప్పున అందజేశారు. అర్జున్ దర్శకత్వం వహించిన ‘సీతాపయనం’లో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది.