News May 14, 2024
ఇన్‌డీడ్‌లో భారీగా ఉద్యోగాల కోత

జాబ్ లిస్టింగ్ కంపెనీ ఇన్‌డీడ్ 2200 (15%) మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. జాబ్ మార్కెట్‌లో ఉద్యోగ అవకాశాలు తగ్గడంతో నిర్వహణ భారం తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. బాధిత ఉద్యోగులకు పరిహారంగా ప్యాకేజ్ అందిస్తామని సంస్థ సీఈఓ క్రిస్ హ్యామ్స్ వెల్లడించారు. ప్రస్తుతం సంస్థ ముందున్న సవాళ్లను ఎదుర్కోవడంపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
21న 54 లక్షల మందికి పోలియో చుక్కలు

AP: నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఈనెల 21న రాష్ట్రంలో 54 లక్షల మంది 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీనికోసం 38,267 బూత్‌లు ఏర్పాటు చేసి 61,26,120 డోస్‌ల వ్యాక్సిన్‌ను రెడీ చేశామన్నారు. ఆరోజు చుక్కలు వేసుకోలేని పిల్లలకు 22, 23 తేదీల్లో 76,534 బృందాలు ఇంటింటికీ వెళ్లి వేస్తాయన్నారు. మొబైల్ బృందాలు, ట్రాన్సిట్ బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు.
News December 13, 2025
మరో ఘటన.. బాలుడి చెవి కొరికేసిన కుక్క

AP: సత్యసాయి జిల్లా కదిరిలోని నిజాంవలి కాలనీలో కుక్క స్వైర విహారం చేసింది. వీధిలోని ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనలో ఆ పిల్లాడి చెవి సగానికిపైగా తెగిపోయింది. బాబుకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న కూడా నంద్యాల జిల్లాలో ఓ బాలికపై <<18545957>>కుక్క దాడి<<>> చేసి చెవి కొరికేసిన విషయం తెలిసిందే.
News December 13, 2025
మెస్సీ ఈవెంట్‌తో సంబంధం లేదు: ఫుట్‌బాల్ ఫెడరేషన్

మెస్సీ టూర్ సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో జరిగిన ఘటనపై ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(AIFF) స్పందించింది. ‘అది PR ఏజెన్సీ నిర్వహించిన ప్రైవేటు ఈవెంట్. ఈ కార్యక్రమం నిర్వహణ, ప్లాన్, అమలు విషయంలో మేము ఇన్వాల్వ్ కాలేదు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఫెడరేషన్ నుంచి అనుమతి కోరలేదు’ అని స్పష్టం చేసింది. మరోవైపు మెస్సీ రావడం, ప్రేక్షకులకు చేతులు ఊపడం వరకే ప్లాన్‌లో ఉందని బెంగాల్ DGP రాజీవ్ కుమార్ తెలిపారు.


