News March 27, 2024
భారీగా స్కాలర్షిప్స్ పెండింగ్.. RTIలో వెల్లడి!

TG: ఇంటర్, డిగ్రీ విద్యార్థులు స్కాలర్షిప్స్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా 2020 నుంచి నిలిచిపోయిన స్కాలర్షిప్స్ వివరాలు తెలపాలని ఓ RTI కార్యకర్త కోరారు. దీనిపై సంబంధిత శాఖ స్పందించింది. వివిధ కారణాలతో భారీ సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. 2020-21లో రూ. 96 లక్షలు, 2021-22లో రూ.1.9కోట్లు, 2022-23లో రూ.17.52 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది.
Similar News
News February 18, 2026
NRPT: శివాజీ జయంతి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి

రేపు జరిగే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జిల్లాలో శాంతియుతంగా జరుపుకోవాలని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 54 చోట్ల శుభ యాత్ర, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జయంతి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శివాజీ విగ్రహాల ప్రతిష్ఠాపనకు అనుమతులు తీసుకోవాలని చెప్పారు.
News February 18, 2026
ఇరాన్‌పై త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్ దాడి?

అమెరికా ఇరాన్‌పై త్వరలోనే భారీ మిలిటరీ ఆపరేషన్ లాంచ్ చేయనున్నట్లు రిపోర్ట్స్ రావడం కలకలం రేపుతోంది. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు విఫలమైతే దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని ఆక్సియాస్ ఏజెన్సీ రిపోర్ట్ వెల్లడించింది. అదే జరిగితే ఆ ఆపరేషన్ కొన్ని వారాల పాటు కొనసాగుతుందని అంచనా వేసింది. న్యూక్లియర్, మిసైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరే లక్ష్యంగా ఇజ్రాయెల్‌తో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టనున్నట్లు తెలిపింది.
News February 18, 2026
SMలో ‘ఓవర్ షేరింగ్’ వద్దు.. ఈ విషయాలు పోస్ట్ చేస్తే డేంజర్!

SMలో మనం సరదాగా పంచుకునే వివరాలే సైబర్ నేరగాళ్లకు అస్త్రాలుగా మారుతున్నాయి. లైవ్ లొకేషన్, బోర్డింగ్ పాస్, బ్యాంక్ వివరాలు, హోమ్ అడ్రస్, పాన్/ఆధార్, CVV, OTP వంటి కీలక విషయాలను షేర్ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఐడెంటిటీ థెఫ్ట్‌కు దారితీసి మీ పేరిట ఆర్థిక మోసాలకు పాల్పడే అవకాశం ఉంది. ప్రైవసీని కాపాడుకోవడానికి టూ-స్టెప్ వెరిఫికేషన్ వంటి సెక్యూరిటీ మోడ్స్ ఆన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.


