News September 11, 2025
ఆ ప్రచారాన్ని ఖండించిన మాస్టర్ బ్లాస్టర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ BCCI తదుపరి ప్రెసిడెంట్ కాబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ ప్రచారానికి తాజాగా సచిన్ తెరదించారు. ఆయనకు చెందిన SRT స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సచిన్‌కు సంబంధించి పలు రిపోర్ట్స్, రూమర్స్ మా దృష్టికి వచ్చాయి. అవన్నీ అవాస్తవాలు. ఊహాగానాలను ప్రచారం చేయొద్దని కోరుతున్నాం’ అని పేర్కొంది.
Similar News
News December 8, 2025
శరీరంలోని ఈ భాగానికి రక్తం అవసరం లేదు!

మానవ శరీరంలో రక్త ప్రసరణ జరగని ఓ భాగం ఉందనే విషయం మీకు తెలుసా? కంటిలోని కార్నియాకు రక్తప్రసరణ జరగదు. ఇది తన అవసరాలకు సరిపడా ఆక్సిజన్‌ను రక్తం ద్వారా కాకుండా నేరుగా వాతావరణంలోని గాలి నుండే గ్రహిస్తుంది. కార్నియాకు రక్తనాళాలు లేకపోవడం వల్లే అది పూర్తి పారదర్శకంగా ఉండి కాంతిని అడ్డుకోకుండా స్పష్టమైన దృష్టిని అందిస్తుంది. అలాగే జుట్టు, గోర్లకు కూడా రక్త ప్రసరణ జరగదు. కానీ ఇవి నిర్జీవ కణాలు.
News December 8, 2025
చైనా మోడల్‌లో తెలంగాణ అభివృద్ధి: రేవంత్

TG: ‘తెలంగాణ రైజింగ్’ నిరంతర ప్రక్రియ అని, అందరి సహకారంతో లక్ష్యాలన్నిటినీ సాధించగలమన్న నమ్మకం ఉందని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చైనా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ మోడల్‌లో TGని అభివృద్ధి చేస్తామని సమ్మిట్‌లో చెప్పారు. చైనా సహా జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియా నుంచి ప్రేరణ పొందామని, వాటితో పోటీపడతామని వివరించారు. విజన్ కష్టంగా ఉన్నా సాధించే విషయంలో నిన్నటికంటే విశ్వాసంతో ఉన్నామని తెలిపారు.
News December 8, 2025
పెరిగిపోతున్న సోషల్ మీడియా ముప్పు

చర్మ సౌందర్యానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మి చాలామంది మహిళలు సమస్యల్లో పడుతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 20- 35 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో 78% మంది ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కనిపించే “మిరాకిల్ ట్రీట్మెంట్”ల నమ్మకంతో నకిలీ స్కిన్ సెంటర్లకు వెళ్తున్నారు. అక్కడ అనుభవం లేనివారితో ట్రీట్మెంట్లు చేయించుకొని చర్మానికి నష్టం కలిగించుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.


