News February 2, 2025
పాకిస్థాన్‌తో మ్యాచ్ అంత ప్రత్యేకమేమీ కాదు: గంభీర్

ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో పాక్‌తో తాము ఆడే మ్యాచ్ ప్రత్యేకమేమీ కాదని భారత కోచ్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు. ‘23న పాక్‌తో మ్యాచ్ ఉంది అని పనిగట్టుకుని గుర్తుపెట్టుకుని టోర్నీలో అడుగుపెట్టం. లీగ్ దశలో 5 మ్యాచులున్నాయి. అన్నీ మాకు కీలకమే. పాక్‌తో మ్యాచ్ కూడా వాటిలాగే. దాని ప్రత్యేకతేమీ లేదు. ప్రేక్షకులకు భావోద్వేగాలుంటాయి’ అని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
Similar News
News February 7, 2025
అమెరికాలో 487 మంది భారత అక్రమ వలసదారులు: MEA

అనుమతి లేకుండా తమ దేశంలో ప్రవేశించిన 104 మంది భారతీయులను అమెరికా ఇటీవల తిరిగి స్వదేశానికి పంపిన విషయం తెలిసిందే. అయితే ఆ దేశ బహిష్కరణ తుది జాబితాలో మొత్తం 487 మంది భారతీయులు ఉన్నట్లు మన దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాజాగా వెల్లడించారు. సంకెళ్లతో వీరిని తరలిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందించారు. సంకెళ్ల అంశంపై అమెరికా వద్ద తమ ఆందోళన తెలియజేశామన్నారు.
News February 7, 2025
KTRకు అంతర్జాతీయ ఆహ్వానం

TG: మాజీ మంత్రి KTRకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. IBC-2025 సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించాలని అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆహ్వానం పలికింది. పదేళ్ల BRS పాలనలో దిగ్గజ కంపెనీల పెట్టుబడులు ఆకర్షించడం అద్భుతమని ప్రశంసించింది. HYDను యువతకు ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దారని, తెలంగాణ పదేళ్ల పారిశ్రామిక ప్రగతి స్ఫూర్తిదాయకమని అభినందించింది.
News February 7, 2025
ఈనెల 12న విజయ్ దేవరకొండ కొత్త సినిమా టీజర్

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర టైటిల్‌తో పాటు టీజర్ వీడియోను ఈనెల 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, ఈ మూవీ టైటిల్‌ను ‘సామ్రాజ్యం’గా ఫిక్స్ చేసినట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది.