News December 16, 2024

వర్షంతో నిలిచిన మ్యాచ్.. కష్టాల్లో భారత్

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టులో మూడో రోజు మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. అంతకుముందు భారత జట్టు 22 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. జైస్వాల్(4), గిల్(1), కోహ్లీ(3) నిరాశపరిచారు. స్టార్క్ 2, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News January 15, 2025

TODAY HEADLINES

image

✒ శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
✒ మహాకుంభమేళా: 3.5 కోట్ల మంది ప‌విత్ర స్నానాలు
✒ 26 నుంచి ఉత్తరాఖండ్‌లో UCC అమలు
✒ ఈ ఏడాదీ 10 శాతం పెరగనున్న రీఛార్జ్ ధరలు?
✒ 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం: సీఎం CBN
✒ కూతురి డిగ్రీ ప్రదానోత్సవం.. లండన్‌కు YS జగన్
✒ తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్
✒ గత ఏడాదికి మించి పెట్టుబడులు సాధిస్తాం: CM రేవంత్
✒ నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

News January 15, 2025

బంగ్లాదేశ్‌లో కంగనా ‘ఎమర్జెన్సీ’ బ్యాన్!

image

కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదలను బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల సరిహద్దు విషయంపై భారత్, బంగ్లా మధ్య వివాదం చెలరేగింది. ఈక్రమంలోనే ఎమర్జెన్సీపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఇంతకుముందు పుష్ప-2, భూల్ భులయ్యా-3 సినిమాలను కూడా బంగ్లా ప్రభుత్వం నిషేధించింది. కాగా ఈనెల 17న ఎమర్జెన్సీ విడుదల కానుంది.

News January 15, 2025

యూపీలో తెలంగాణ బస్సుకు అగ్నిప్రమాదం

image

ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో 50 మంది TGలోని భైంసా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో పల్సికి చెందిన ప్రయాణికుడు మరణించాడు. మిగతావారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో బస్సుతో పాటు ప్రయాణికుల సామాగ్రి దగ్ధమైంది. వీరంతా కాశీకి వెళ్తున్నట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.