News June 17, 2024
వధువును వెతకలేకపోయిన మ్యాట్రిమొనీ.. వ్యక్తికి రూ.25వేల పరిహారం

తనకు నిర్ణీత సమయంలో వధువును వెతకడంలో కేరళ మ్యాట్రిమొనీ సంస్థ విఫలమైందంటూ ఓ వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. 2019 జనవరిలో తాను ఫీజు చెల్లిస్తే నెలలు గడిచినా సంస్థ స్పందించలేదని అతను తెలిపారు. ఫిర్యాదుదారుడికి మ్యాట్రిమొనీ సరైన సేవలు అందించలేదని న్యాయమూర్తి గుర్తించారు. అతను చెల్లించిన రూ.4,100+వడ్డీ, పరిహారంగా రూ.25,000, ఖర్చుల కింద రూ.3,000 ఇవ్వాలని ఆదేశించారు.
Similar News
News January 14, 2026
నేడు రెండో వన్డే.. సిరీస్‌పై టీమ్ ఇండియా గురి

నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే రాజ్‌కోట్ వేదికగా జరగనుంది. 3 ODIల సిరీస్‌లో ఇప్పటికే ఒకటి టీమ్ ఇండియా గెలవగా రెండోది కూడా గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్‌లో అదరగొట్టారు. ఇక కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అదే విధంగా బౌలర్లు కూడా రాణిస్తే సిరీస్ మనదే అవుతుంది. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 నుంచి JioHotstar, Star Sportsలో వస్తుంది.
News January 14, 2026
మహిళలకు రూ.1500 ఎప్పుడు ఇస్తారు: YS షర్మిల

AP: ప్రభుత్వంపై APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా మహాశక్తి పథకాన్ని అమలు చేయలేదని మండిపడ్డారు. పండుగల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడబిడ్డ నిధి పథకం ప్రకారం 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు ప్రతి నెల రూ.1500 ఇవ్వాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News January 14, 2026
ముగ్గుల్లో గమ్మతైన గణితం.. ఇలా మెదడు షార్ప్!

పిల్లల్లో గణితం పట్ల ఆసక్తి పెంచడానికి ముగ్గులు గొప్ప సాధనం. చుక్కలు పెట్టడం ద్వారా అంకగణితం, వాటిని కలపడం ద్వారా రేఖాగణితం సులభంగా అర్థమవుతాయి. సరి, బేసి సంఖ్యల అవగాహన పెరుగుతుంది. 7 సంవత్సరాల లోపు పిల్లలకు ముగ్గులు నేర్పించడం వల్ల వారి మెదడు చురుగ్గా వృద్ధి చెందుతుంది. సంక్లిష్టమైన ముగ్గులు వేయడం మేధస్సుకు సవాలుగా మారుతుంది. ఇది ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని అద్భుతంగా మెరుగుపరుస్తుంది.


