News April 25, 2024
ఈనెల 28న అత్యధిక ఉష్ణోగ్రతలు: ఐఎండీ

తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 28న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, రాత్రి వేడిగాలులు ఉంటాయని తెలిపింది. దక్షిణ తెలంగాణ, యానాం, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా (44°C) నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
Similar News
News April 15, 2026
సంగారెడ్డి: పేర్లు కనిపించక విద్యార్థుల ఆందోళన

జనరల్ గురుకులాలు, కేజీబీవీల్లో ఇంటర్ ప్రథమ సంవత్సర దరఖాస్తుల గడువు బుధవారంతో ముగుస్తుంది. అయితే, ఆన్‌లైన్ దరఖాస్తుల్లో సీఈసీ గ్రూపులు, కళాశాలల పేర్లు కనిపించకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేడు చివరి రోజు కావడంతో వెబ్‌సైట్ మొరాయిస్తోందని సంగారెడ్డి విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సాంకేతిక లోపాలను సరిచేసి, దరఖాస్తు గడువును పొడిగించాలని కోరుతున్నారు.
News April 15, 2026
వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్?

AP: వైసీపీ చీఫ్ జగన్ మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టించారనే ఆరోపణలతో ఆయనపై చిత్తూరు జిల్లా కుప్పంలో కేసు నమోదైంది. దీంతో శ్రీహరిని అరెస్టు చేసి ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.