News May 1, 2024
మే 1: చరిత్రలో ఈరోజు

* అంతర్జాతీయ కార్మిక దినోత్సవం.
* 1867: స్వాతంత్ర్య సమరయోధుడు కాశీనాథుని నాగేశ్వరరావు జననం.
* 1913: స్వాతంత్ర్య సమరయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య జననం.
* 1958: రచయిత సోమేపల్లి వెంకట సుబ్బయ్య జననం.
* 1971: నటుడు అజిత్ కుమార్ జననం.
* 1988: బాలీవుడ్ నటి అనుష్క శర్మ జననం
Similar News
News December 17, 2025
ఎత్తుపడిన గొడ్డు పులికి జడుస్తుందా?

ముసలిదైపోయి, నీరసించి, ఇక చావుకు దగ్గరగా ఉన్న పశువు తన ముందుకు పులి వచ్చినా భయపడదు. ఎందుకంటే అది ఇప్పటికే చావు అంచుల్లో ఉంది, కాబట్టి కొత్తగా వచ్చే ప్రాణాపాయానికి అది ఆందోళన చెందదు. అలాగే జీవితంలో ఎన్నో దెబ్బలు తిని, కష్టాల చివరన ఉన్న వ్యక్తిని ఎవరైనా భయపెట్టాలని చూస్తే అతడు అస్సలు భయపడడు. “పోయేదేముంది?” అనే తెగింపు వచ్చినప్పుడు మనిషికి దేనికీ జంకడు అని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.
News December 17, 2025
T20 సిరీస్ పట్టేస్తారా?

SAతో ఇవాళ IND నాలుగో T20 ఆడనుంది. ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న IND సిరీస్ పట్టేయాలని చూస్తోంది. అటు చివరి T20 వరకు సిరీస్ విజేతను వాయిదా వేయాలని SA బరిలోకి దిగనుంది. గత 20+ మ్యాచులుగా విఫలమవుతున్న సూర్య ఫామ్ అందుకుంటారా? లేదా? అని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. గిల్ సైతం రన్స్ చేయాల్సి ఉంది. లక్నో వేదికగా 7PMకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక్కడి ఎకానా స్టేడియంలో ఆడిన 3 T20ల్లోనూ IND గెలిచింది.
News December 17, 2025
అగరుబత్తీలతో ఆరోగ్యం.. ఇలా చేయండి

సువాసన గల అగరుబత్తీలు ఇంట్లో ధ్యానానికి, పూజకు అనుకూలంగా సానుకూల శక్తిని నింపుతాయి. అయితే దోమల కోసం వాడే రసాయన అగరుబత్తీలుు అలా కాదు. అవి ఆరోగ్యాన్ని, శ్వాసకోశాన్ని పాడుచేస్తాయి. అందుకే సాధారణ అగరుబత్తీలకే బామ్ వంటిది పూసి వెలిగించడం వల్ల దోమలు దూరమవుతాయి. దీనివల్ల ఆధ్యాత్మిక వాతావరణానికి కూడా ఆటంకం కలగదు. ఈ సురక్షిత మార్గం ద్వారా దేవతా పూజకు అవసరమైన పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుంది.


