News August 15, 2025

MBNR: ఆపరేషన్ ముస్కాన్ అంటే ఏంటో తెలుసా..?

image

ఆపరేషన్ ముస్కాన్ అంటే.. బడికి వెళ్లే వయసులో పరిశ్రమల్లో కార్మికులుగా మారిన వారిని గుర్తించడమే ఈ “ఆపరేషన్ ముస్కాన్”. పలు చోట్ల యాచకులుగా, కార్మికులుగా రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో కాలం వెల్లదీస్తున్న వారిని చిన్నారులను గుర్తించి ఈ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా చేరదీస్తున్నారు. జులైలో పాలమూరు పోలీసులు 133 మందిని రక్షించారు. బాల కార్మికులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

Similar News

News March 16, 2026

భారత్‌కు గుడ్ న్యూస్.. గ్యాస్ కష్టాలు తీరనున్నాయ్

image

హార్ముజ్ జలసంధిలో అడ్డంకులను దాటుకున్న శివాలిక్ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు కొన్ని గంటల్లో చేరుకోనుంది. ఇందులో దాదాపు 40-46 వేల మెట్రిక్ టన్నుల LPG ఉంది. దీని రాకతో దేశంలో గ్యాస్ కష్టాలు కొంత వరకు తగ్గనున్నాయి. 46వేల మెట్రిక్ టన్నుల LPGతో ‘నందా దేవి’ అనే నౌక కూడా అతి త్వరలో భారత్‌కు చేరుకోనుంది. దీనికి ఇండియన్ నేవీ ఎస్కార్ట్ కల్పిస్తోంది.

News March 16, 2026

నాగార్జునసాగర్ తీరంలో సైక్లింగ్ జోష్

image

అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌కు వచ్చే సందర్శకుల కోసం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. సాగర్ తీరంలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సైక్లింగ్ ప్రారంభించారు. విజయవిహార్ అతిథి గృహంలో ప్రస్తుతానికి 10 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. పర్యాటకులు గంటకు రూ.100 చొప్పున చెల్లించి ఈ సైకిళ్లను వినియోగించుకోవచ్చు.

News March 16, 2026

రాజవొమ్మంగి: పరీక్ష టెన్షన్.. తెలుగు టీచర్‌కు ప్రమాదం

image

రాజవొమ్మంగిలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ఆ ఒత్తిడిలో పాఠశాలకు వెళ్తున్న ఉపాధ్యాయురాలు డి. శ్రీదేవి ప్రమాదానికి గురయ్యారు. రాజవొమ్మంగి ఆశ్రమ బాలికల పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్న ఆమె, సోమవారం ఉదయం స్కూల్ సమీపంలో బైక్ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె చేయి, కాలుకు గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను రాజవొమ్మంగి PHCకి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు.