News April 27, 2024

MBNR: ఆలోచించి ఓటెయ్యండి: మాజీ సీఎం కేసీఆర్

image

BRS బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా కేసీఆర్ భారీ రోడ్ నిర్వహించారు. KCR ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు నిలబడ్డాయి.. BRS, కాంగ్రెస్, BJP.. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరు పని చేస్తరో.. ఎవరు న్యాయంగా ఉంటారో.. వాళ్లకు ఓటేస్తేనే మన బతుకులు బాగుపడుతాయి. పని చేయని వాళ్లకు వేస్తే ఇబ్బంది పెడుతరు.’ అని హితవు పలికారు.

Similar News

News April 17, 2026

మహబూబ్‌నగర్‌లో ఈ నెల 18న ఉద్యోగ మేళా

image

మహబూబ్‌నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 18న ఉదయం 10:30 గంటలకు ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్ పిల్లలమర్రి రోడ్డులో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. 10వ తరగతి ఆపై చదివిన 18-30 ఏళ్ల యువత 6 ప్రైవేట్ సంస్థల్లో 250 ఖాళీల భర్తీకి అర్హులని జిల్లా ఉపాధి కల్పన అధికారి మైత్రి ప్రియ తెలిపారు. ఆసక్తి గలవారు సర్టిఫికెట్లు, బయోడేటాతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 8919380410 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

News April 16, 2026

MBNR: పీయూ..డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 6వ సెమిస్టర్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. వివేకానంద డిగ్రీ కళాశాలలో పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ కే.ప్రవీణ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్ కే.ప్రవీణ మాట్లాడుతూ.. డిగ్రీ పరీక్షలు సజావుగా జరగాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, మాస్ కాఫీయింగ్‌కు అవకాశం లేకుండా చూడాలని అధికారులను సూచించారు.

News April 16, 2026

జడ్చర్ల: పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య

image

జడ్చర్ల మండలంలోని కొడుగల్ ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధి బిమ్లాగాని తండాకు చెందిన జనరల్ మెడిసిన్ పీజీ విద్యార్థి కాట్రావత్ సురేష్ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదువుతున్న సురేష్ హాస్టల్ రూంలో పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.