News November 8, 2024
MBNR: ఉపాధ్యాయురాలు స్కెచ్.. ఏసీబీకి చిక్కిన DEO
మహబూబ్‌నగర్ ఇన్‌ఛార్జ్ డీఈఓ రవీందర్ ఏసీబీకి చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పదోన్నతుల్లో ఓ ఉపాధ్యాయురాలుకు దక్కాల్సిన ప్రమోషన్ మరొక ఉపాధ్యాయురాలకు దక్కడంతో ఆమె ఎన్నోసార్లు డీఈఓ రవీందర్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం దక్కలేదు. కోర్టుకు వెళ్లినప్పటికీ లంచం డిమాండ్ చేయడంతో ACBకి ఆశ్రయించారు. ఈ క్రమంలో DEOను హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు.
Similar News
News December 11, 2024
MBNR: నీటిపారుదల సమీక్షలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు
హైదరాబాద్ జలసౌధలో బుధవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొని తమ తమ నియోజకవర్గాలకు పెండింగ్ పనులను, కొత్తగా చేపట్టబోయే పనులను గురించి మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేస్తామని తెలిపారన్నారు.
News December 11, 2024
PU డిగ్రీ పరీక్షల రీషెడ్యూల్.. ఈనెల 21 నుంచి పరీక్షలు
పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్ విడుదలైంది. డిగ్రీ 1వ సెమిస్టర్, 5వ సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 25 నుంచి జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ఈ పరీక్షలను డిసెంబర్ 21 నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపారు.
News December 11, 2024
గ్రూప్-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్
డిసెంబర్ 15, 16వ తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై బుధవారం ఐడీఒసీ సమావేశ మందిరంలో చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, జాయింట్ రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లకు పవార్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.