News February 19, 2025
MBNR: ఎముక గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

పెళ్లిలో భోజనం చేస్తుండగా.. ఎముక ఇరుక్కుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బాలానగర్ మండల పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. MBNR మండలం దొడ్డలోనిపల్లికి చెందిన జహంగీర్(49) తిర్మలాయకుంటతండాలో ఓ పెళ్లికి వెళ్లాడు. భోజనం చేస్తుండగా.. గొంతులో ఎముక ఇరుక్కుని కిందపడిపోయాడు. అక్కడున్నవారు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News April 18, 2026
విజయ్ చేతిలో శునకాలు.. ఆసక్తికరంగా కొత్త సినిమా పోస్టర్

హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో చేయనున్నట్లు ప్రకటించారు. దర్శకుడి ఊహాశక్తికి తగ్గట్టుగా ఈ మూవీ కోసం తన సర్వస్వాన్ని అందిస్తానని విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలెజాండ్రో మార్టినెజ్(DOP), హేశమ్ అబ్దుల్ వాహెబ్(మ్యూజిక్), ఎరిక్ డర్స్ట్(VFX)ను పరిచయం చేశారు. హీరో శునకాలను, డైరెక్టర్ గుర్రాన్ని పట్టుకున్నట్లుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది.
News April 18, 2026
పేరూరు చెరువును పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే

చంద్రగిరి నియోజకవర్గంలో నీటి వనరుల సంరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా నిర్వహిస్తున్న “జలధార – జలహారతి” కార్యక్రమంలో భాగంగా పేరూరు చెరువును కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు బైకుపై చెరువు పరిసర ప్రాంతాలు పతిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News April 18, 2026
KNR: వాహనదారులకు ‘రిజిస్ట్రేషన్’ కష్టాలు..!

వాహన్ పోర్టల్ అమలుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభమైందని చెప్పినా, RCలు సకాలంలో అందక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షోరూంల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయి 2 నెలలు గడిచినా RCలు అందకపోవడం గమనార్హం. TR గడువు ముగిసినా RC లేక వాహనదారులు రోడ్లపైకి వెళ్లలేకపోతున్నారు. RTO కార్యాలయాల్లో అడిగితే సాంకేతిక కారణాలంటూ పంపిస్తున్నారని బాధితులు చెబుతుండగా ఈ సమస్య కరీంనగర్, పెద్దపల్లి, HZBలలో ఎక్కువగా ఉంది.


