News March 28, 2024

MBNR: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ఓట్లు కీలకం!

image

ఉమ్మడి MBNR జిల్లాలో బుధవారం జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో BJP ఓట్లు కీలకం కానున్నాయి. మొత్తం 1,439 ఓట్లలో దాదాపు 119 ఓట్లు BJPకి ఉన్నాయి. ఎన్నికల్లో BJP అభ్యర్థి పోటీ చేయకపోవడం వల్ల ఆ ఓట్లు ఏ పార్టీకి పడతాయోనని రాజకీయ వర్గాలలో చర్చ కొనసాగుతుంది. కొంతమంది కాంగ్రెస్, మరి కొంతమంది BRS వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావితం చూపే అవకాశం ఉంది.

Similar News

News February 17, 2026

జడ్చర్ల: ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన జడ్చర్ల మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గంగాపూర్ గ్రామ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న మిడ్జిల్ మండలం రాణి పేట గ్రామానికి చెందిన బోయ శివ(26) అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి రజని (26) కి తీవ్ర గాయాలు కాగా 108లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News February 17, 2026

పాలమూరు: యూరియా..Booking చేసుకోండి ఇలా!

image

✒Google Play నుండి “Fertilizer Booking App”ను ఇన్‌స్టాల్
✒మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఓటిపి ద్వారా లాగిన్ అవ్వాలి
✒పట్టాదారు పాస్‌బుక్ నంబర్, ఆధార్, పంట వివరాలు నమోదు చేయాలి
✒సమీపంలోని డీలర్ వద్ద స్టాక్ లభ్యతను తనిఖీ చేసి, కావలసిన బస్తాల సంఖ్యను ఎంచుకుని బుక్ చేసుకోవాలి
✒48 గంటల్లోపు డీలర్ వద్దకు వెళ్లి  తీసుకోవాలి
✒15 రోజుల తర్వాత మళ్లీ బుక్ చేసుకోవచ్చు
#SHARE IT

News February 17, 2026

MBNR: మేయర్, డిప్యూటీ మేయర్ వేతనాలు ఎంతో తెలుసా..!

image

మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా ముగిశాయి. ఎంతోమంది ఎన్నో ఎన్నో లక్షల ఖర్చు చేసుకుని ఎన్నికల్లో పోటీపడి కార్పొరేటర్‌గా గెలిచారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు కూడా గట్టి పోటీ ఉంటుంది. మేయర్ నెలసరి వేతనం రూ.65 వేలు ఉంటుంది. అలాగే డిప్యూటీ మేయర్‌కు రూ.32,500, అలాగే కార్పొరేటర్‌కు రూ.7,800 వేతనాలు ఉంటాయి.