News December 1, 2025

MBNR: ఓపెన్ డిగ్రీ పరీక్ష ఫీజు గడువు ఇదే!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫీజును డిసెంబర్ 27లోగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. ఈ పరీక్షలు 2026 ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు జరుగుతాయని మహబూబ్‌నగర్ వర్సిటీ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

Similar News

News February 15, 2026

యనమలకుదురులో ఐజీపీ తనిఖీలు

image

మహాశివరాత్రి పురస్కరించుకొని యనమలకుదురులో భద్రతా ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజీపీ జీ.వీ.జీ. అశోక్ కుమార్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పండుగను భక్తులు ప్రశాంతంగా జరుపుకొనేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభల ఊరేగింపు, భక్తుల రద్దీని అంచనా వేసి తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.

News February 15, 2026

TODAY HEADLINES

image

* రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్
* రూ.57,868 కోట్లతో అమరావతి పనులు: పయ్యావుల
* బిల్ గేట్స్‌ను 3సార్లు APకి తీసుకొచ్చింది నేనే: CBN
* బడ్జెట్ ప్రసంగంలో భజనే ఉంది: బొత్స
* దేశాన్ని కాంగ్రెస్ అవమానిస్తోంది: మోదీ
* USతో డీల్.. ‘టెక్స్‌టైల్’కు ఉరితాడు: రాహుల్
* ‘మున్సిపల్’ స్ఫూర్తితో ముందుకెళ్లాలి: రేవంత్
* TG: 17న ‘రైతు భరోసా’?
* TG: కొత్తగూడెం కార్పొరేషన్.. CPI, కాంగ్రెస్ పొత్తు

News February 15, 2026

రేపు పాక్‌పై అభిషేక్ సునామీ!

image

T20WC: భారత కెప్టెన్ <<19142443>>సూర్య<<>> మాటలతో విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ రేపు పాక్‌పై ఆడటం ఖాయమైంది. అటు గంభీర్ పర్యవేక్షణలో ఇవాళ అతను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు సైతం బయటికొచ్చాయి. ఇప్పటి వరకు అభిషేక్ పాక్‌పై ఆడిన 3 మ్యాచుల్లోనూ అదరగొట్టారు. 190 స్ట్రైక్‌రేట్‌తో 110 రన్స్ చేశారు. రేపటి మ్యాచులోనూ చెలరేగి భారత్‌కు శుభారంభం అందించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అటు అభిషేక్ ఆడనున్న నేపథ్యంలో సంజూపై వేటు పడనుంది.