News April 26, 2024
MBNR: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చిందా: KCR

కాంగ్రెస్ గెలవగానే క్షణాల్లో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు మరీ హామీ ఇచ్చినట్లుగా చేశారా? అని BRS అధినేత KCR ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటికీ రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు బంధు నిధులు అందలేదని ఫైర్ అయ్యారు. పెళ్లి చేసుకునే యువతులకు తులం బంగారం ఇస్తామని అన్నారు.. మరీ ఇచ్చారా? ఈ ఎన్నికల్లో మోడీకి ఓటేస్తే.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు’ అని హెచ్చరించారు.
Similar News
News April 18, 2026
జడ్చర్ల: సురేశ్ మృతిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బిమ్లాగాని తండాకు చెందిన కాట్రావత్ సురేష్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతూ ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ శనివారం పెద్దింటి రవీంద్రనాథ్ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

MBNR: అక్కడ.. 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. గండీడ్ మండలం సల్కర్‌పేట 43.6, దేవరకద్ర 43.1, కోయిలకొండ మండలం పారుపల్లి, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.9, మేడ్చల్ మండలం దోనూరు కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 42.5, అడ్డాకుల 42.4, మహమ్మదాబాద్ 42.3, MBNR (U/R) 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.