News May 10, 2024

MBNR: కార్మికురాలిపై అత్యాచారం.. వ్యాపారిపై కేసు

image

ఓ కార్మికురాలిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. MBNR జిల్లాకు చెందిన దంపతులు ఉపాధి కోసం శంషాబాద్‌కు వచ్చి బతుకుతున్నారు. ఈ క్రమంలోనే అహ్మద్‌నగర్‌కు చెందిన తుక్కు వ్యాపారి ఖలీల్‌ పరిచయమయ్యాడు. ఈనెల 25న పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఆమెను బైక్‌పై వదిలేస్తానని చెప్పి లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈమేరకు బాధితుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేశారు.

Similar News

News December 12, 2025

MBNR : భూత్పూర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భూత్పూర్‌లో 9.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిరి వెంకటాపుర్ 9.7°C, దోనూరు 9.8°C, పారుపల్లి 10.4°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

News December 12, 2025

MBNR జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

MBNR జిల్లాలో 139 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 83.04 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

News December 12, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

MBNR: గెలుపొందిన అభ్యర్థులకు డీజు సౌండ్‌తో ర్యాలీకి అనుమతి లేదు: ఎస్పీ డి.జానకి
@ప్రశాంతంగా ముగిసిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు.
@రాజపూర్ మండలం రంగారెడ్డిగూడ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటేపాగ రేవతి 31 ఓట్లతో గెలుపు.
@నవాబుపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపు.
@రాజాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కావలి రామకృష్ణ 1104 భారీ మెజార్టీతో గెలుపు.