News August 21, 2025

MBNR: ‘గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు ఆ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి’

image

మహబూబ్ నగర్ జిల్లా అంబేడ్కర్ కళాభవన్‌లో ఎస్పీ డి.జానకి పోలీసులు శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ వెంకటేశ్వర్లు హాజరై, గణేష్ మండప నిర్వాహకులకు ముఖ్య సూచనలు అందించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపనకు తప్పనిసరిగా https://policeportal. tspolice.gov.in/index.htm పోలీస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. టౌన్ ఇన్స్పెక్టర్ హెజాజుద్దీన్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News January 24, 2026

మహబూబ్‌నగర్: విద్యుత్ సమస్యలకు చెక్

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఉన్న మొక్కలను తొలగిస్తున్నామని ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ భీమా నాయక్ తెలిపారు. తిరుమలాపూర్ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నామన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పలువురు ఎస్ఈకి ఫిర్యాదు చేయగా పనులు చేపట్టామని చెప్పారు.

News January 23, 2026

గంగాపురం జాతరకు ప్రత్యేక బస్సులు

image

గంగాపురంలో కొలువైన లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ కోఆర్డినేటర్ సంతోశ్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రం నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వారికి సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

News January 23, 2026

MBNR: ఎంవీఎస్‌ కళాశాలలో రేపు జాతీయ స్థాయి సెమినార్‌

image

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ స్థాయి బహుశాఖ సెమినార్‌ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్‌ డా. కె.పద్మావతి తెలిపారు. విద్యా, వైద్య, పరిశోధన రంగాల్లోని నూతన ఆవిష్కరణలపై ఈ సదస్సు జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా టీజీసీహెచ్‌ఈ ఛైర్మన్‌ ప్రొ. వి.బాలకృష్ణారెడ్డి, గౌరవ అతిథిగా పాలమూరు వర్సిటీ వీసీ ప్రొ. జి.ఎన్.శ్రీనివాస్‌ హాజరుకానున్నారు.