News April 22, 2024

MBNR: గురుకుల ప్రవేశ పరీక్షకు 85.04 శాతం హాజరు

image

రాష్ట్ర గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్షకు 85.04 శాతం విద్యార్థులు హాజరైనట్లు జిల్లా సమన్వయకర్త, బీచుపల్లి గురుకుల కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని, మొత్తం 11,660 మంది విద్యార్థులకు గాను 9,920 మంది హాజరయ్యారని ఆయన వివరించారు.

Similar News

News December 10, 2025

MBNRలో తొలి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు విడతలుగా జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు రేపు తొలి విడత పోలింగ్‌కు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. రాజాపూర్, నవాబుపేట, మహబూబ్‌నగర్ రూరల్, మహమ్మదాబాద్, గండీడ్ మండలాలలో పోలింగ్ జరగనుంది. ఉ.7 గంటల నుంచి మ.1 గంట వరకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతాయి. మ.2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News December 9, 2025

దేవరకద్ర: సర్పంచ్ అభ్యర్థి.. 20 హమీలతో బాండ్

image

దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి బీజేపీ అభ్యర్థిగా రోజా రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. తనను గెలిపిస్తే 20 హామీలు నెరవేరుస్తానని బాండ్ పేపర్ రాశారు. వీటిలో ప్రధానంగా శివాజీ విగ్రహం ఏర్పాటు, రోడ్లు, వీధిదీపాలు, గ్రంథాలయం, ఆదాయ వ్యయాలను గ్రామసభలో చూపిస్తానన్నారు. 3 ఏళ్లల్లో 70% హామీలను నెరవేరుస్తామని అన్నారు.

News December 9, 2025

జడ్చర్ల: పంచాయతీ ఏర్పడిన ఐదేళ్లకు ఎన్నికలు

image

జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన తర్వాత 2020 డిసెంబర్ 20 నుంచి ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో గ్రామంలో మూడో విడత ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యలు తీరి గ్రామ సర్పంచ్ పాలనలో గ్రామ అభివృద్ధి చెందిందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.