News January 14, 2025

MBNR: జూ.కళాశాలల్లో సమస్యలు..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమస్యలు తాండవం చేస్తున్నాయి. బదిలీలు, ఇతర కారణాలతో మొత్తం 14 కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కళాశాలలు ఇన్చార్జుల పాలనలో నడుస్తున్నాయి. వీరు వారి కళాశాలతో పాటుగా అదనపు బాధ్యతలు అప్పగించిన కళాశాలలను కూడా చూసుకోవాల్సి వస్తోంది. దీంతో అనేక పాలనాపరమైన సమస్యలు నెలకొన్నాయి. పదోన్నతుల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయవలసి ఉంది.

Similar News

News February 13, 2025

MBNR: జన సంద్రంగా మన్యంకొండ

image

మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం భక్త జనసంద్రమైంది. భక్తుల గోవింద నామ స్మరణంతో ఆలయ గిరులు మారుమోగాయి. గురువారం తెల్లవారుజాము వరకు జరిగిన రథోత్సవ వేడుకలలో స్థానిక MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, SP జానకి, జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి, హుడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్  తదితరులు పాల్గొన్నారు.  

News February 13, 2025

దామరగిద్ద: మన్యంకొండ జాతరకు వెళ్తే ఇళ్లు దోచారు !

image

దామరగిద్ద మండలంలోని ఉల్లిగుండం గ్రామానికి చెందిన చాలామంది తమ ఇంటి ఇలవేల్పు మన్యంకొండ జాతర రథోత్సవానికి ఎడ్లబండ్లతో బయలుదేరి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ గ్రామంపై కన్నేశారు. బుధవారం అర్ధరాత్రి పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గమనించి వారిని వెంబడించగా.. వారు తెచ్చుకున్న బైక్ వదిలి పారిపోయినట్లు స్థానికులు వాపోతున్నారు. పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.

News February 13, 2025

నాగర్‌కర్నూల్‌లో మహిళ దారుణ హత్య

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మహిళ దారుణ హత్యకు గురైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో శాంతమ్మ(45)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లు సమాచారం. అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ కనకయ్య విచారణ చేపట్టారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.

error: Content is protected !!