News June 18, 2024

MBNR: డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

image

మహబూబ్ నగర్ జిల్లాకేంద్రంలోని మౌలాలి గుట్టలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సోమవారం పరిశీలించారు. మొదటి దశలో 588,రెండవ దశలో 84 మొత్తం 672 డబుల్ బెడ్ రూంలను నిర్మాణం చేసినట్లు గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వైద్యం భాస్కర్ కలెక్టర్‌కు వివరించారు. 672 గృహాలలో 588 గృహాలు లబ్దిదారులకు కేటాయించినట్లు తెలిపారు.

Similar News

News January 20, 2026

MBNR: సీఎం రేవంత్ రెడ్డిపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు

image

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై MBNR జిల్లా అదనపు ఎస్పీకి మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ యాదయ్య మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 18న ఖమ్మంలో జరిగిన మహాసభలో రాష్ట్ర సీఎం బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, సీఎం హోదాలో ఉండి ఈ విధంగా చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

News January 20, 2026

మహబూబ్‌నగర్‌లో అగ్నిప్రమాదం

image

మహబూబ్‌నగర్ పట్టణంలోని పారిశ్రామిక వాడలో గల ఓ బెడ్ వర్క్స్‌లో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పక్కనే గ్యాస్ సిలిండర్ల గోదాం ఉండటంతో ప్రమాద ముప్పు పొంచి ఉందని, ఆ బెడ్ వర్క్స్‌ను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

News January 20, 2026

జిల్లాలో చలి పంజా.. రాజాపూర్‌లో 11.8 డిగ్రీలు

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాజాపూర్‌ మండలంలో అత్యల్పంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జడ్చర్లలో 12.1, కొత్తపల్లిలో 13.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలితో రాత్రివేళల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.