News April 2, 2024

MBNR: డబ్బులు తీసుకెళ్తున్నారా.. ఇది తప్పనిసరి!

image

ఎన్నికల కోడ్ ఉన్నందున శుభకార్యాల వేళ నగదు వెంట తీసుకెళ్లేవారు పెళ్లి కార్డులు, ఆ నగదు ఏ బ్యాంకు అకౌంట్ నుంచి డ్రా చేశారు..? ఎంత డ్రా చేశారు..? ఏం కొనుగోలు చేయబోతున్నారు..? వంటి వాటికి ఆధారాలు చూపించాలని ఉమ్మడి జిల్లా పోలీసులు పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు వెళ్లేవారు పేషెంట్ వివరాలు వెంట తీసుకెళ్లాలి. తర్వాత సరైన ఆధారాలు చూపించి నగదును తిరిగి పొందవచ్చని వారు సూచిస్తున్నారు.

Similar News

News February 10, 2026

MBNR: హీటర్ షాక్ కొట్టి యువకుడి మృతి

image

మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన యువకుడు జామ్ రవి కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు. రవి జడ్చర్లలోని అరబిందో ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో స్నానం చేయడానికి హీటర్‌ను ఉపయోగిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News February 10, 2026

MBNR: కుదిరితే రూ.500 లేదంటే రూ.2 వేలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60 డివిజన్లు, 316 వార్డులకు బుధవారం ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా గెలవాలని పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లకు డబ్బు పంపిణీ సిద్ధమయ్యారు. పోటీ ఎక్కువగాలేని వార్డుల్లో ఓటుకు రూ.500 వరకు పంచుతున్నట్లు తెలిసింది. త్రిముఖపోటీ ఉన్నచోట రూ.2 వేలు, ద్విముఖపోరు ఉన్నచోట్ల రూ.1500 చొప్పున ఓటుకు నోటు పంచేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి నుంచే ఈ ప్రక్రియకు తెరలేపినట్లు సమాచారం.

News February 10, 2026

MBNR: సౌత్ జోన్.. నేడు చెస్ ఎంపికలు

image

సౌత్ జోన్ & ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో భాగంగా చెస్ (స్త్రీ) ఎంపికలను ఈనెల 10న నిర్వహిస్తున్నట్లు పాలమూరు యూనివర్సిటీ పీడీ డాక్టర్ వై.శ్రీనివాసులు “Way2News”తో తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని ఉన్న సంబంధిత కళాశాలల విద్యార్థులు బోనఫైడ్‌పై ప్రిన్సిపల్ సంతకంతో హాజరు కావాలన్నారు. 17-25 లోపు వయసు ఉండాలన్నారు. ముఖ్య అతిథిగా వీసీ జిఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు హాజరుకానున్నారు.