News March 14, 2025
MBNR : నవవధువు సూసైడ్

మహబూబ్‌నగర్ జిల్లాలో నవవధువు సూసైడ్ చేసుకుంది. పోలీసులు వివరాలు.. కొందుర్గు మం. ఎన్కెపల్లికి చెందిన సుజాత(21)కు నవాబ్‌పేట మం. లింగంపల్లికి చెందిన రాములుతో గత నెల 7న పెళ్లైంది. కాగా పెళ్లికి రూ.6 లక్షలు అయ్యాయని అవి తీసుకురావాలని భర్త ఇబ్బంది పెట్టాడు. ఈక్రమంలో వెంకిర్యాలలో టీస్టాల్‌లో పనిచేస్తున్న తల్లిదండ్రుల వద్దకొచ్చిన సుజాత బాత్‌రూమ్‌లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైనట్లు SI బాలస్వామి తెలిపారు.
Similar News
News February 18, 2026
వైవీయూ మ్యాజిక్ బస్ ఇండియా సంస్థతో MOU

యోగి వేమన యూనివర్సిటీ ప్లేస్మెంట్ సెల్ బెంగళూరు మ్యాజిక్ బస్ ఇండియా సంస్థతో మధ్య మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU) కుదుర్చుకున్నారు. విశ్వవిద్యాలయ విద్యార్థుల భవిష్యత్ ప్లేస్మెంట్ దృష్టిలో పెట్టుకొని శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. మ్యాజిక్ బస్ ఇండియా సంస్థ తరఫున శేఖర్ బాబు వైవీయూ ప్రిన్సిపల్ ప్రొ. శ్రీనివాస్, ప్రొ. విజయ భారతి సంతకాలు చేశారు.
News February 18, 2026
రాజ్యసభ ఎన్నికల్లో NDAదే పైచేయి?

మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికలతో ఎగువసభలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. 37 సీట్లకు జరగనున్న ఈ ఎన్నికల్లో NDAకి మరో 6 సీట్లు పెరిగి టోటల్ ట్యాలీ 21కు చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇండియా కూటమికి 4 సీట్లు తగ్గి విన్నింగ్ సీట్స్ 15కు పరిమితమయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల అంచనా. ఇక TG, హరియాణా, హిమాచల్‌లో కాంగ్రెస్ స్థానాలు పెరగొచ్చు.
News February 18, 2026
జగిత్యాల: ‘ఇందిరమ్మ ఇళ్లను 100% గ్రౌండ్ చేయాలి’

ఇందిరమ్మ ఇళ్లను 100% గ్రౌండ్ చేయాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మార్క్ అవుట్ చేయని ఇందిరమ్మ ఇళ్ల పట్టణ, రూరల్ ప్రాంతాల్లో పెండింగ్లో ఉన్న వాటికి ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని తెలిపారు. మార్క్ అవుట్ చేయని పక్షంలో వాటిని రద్దు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్నారు.


