News March 9, 2025
MBNR: నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.
Similar News
News March 27, 2025
పెదగంట్యాడలో ఫ్రీ కోచింగ్.. ఎస్సీలు మాత్రమే అర్హులు

ఏపీ ప్రభుత్వం స్థాపించిన నేక్ ఆధ్వర్యంలో ఫ్రంట్ ఆఫీస్ అసోసియేట్ గా ఉపాధి కొరకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు నేక్ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ గురువారం తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన 18-44 సంవత్సరాలలోపు ఎస్సీ కులాలకు చెందిన యువతకు మాత్రమే 3 నెలల శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ అనంతరం ప్రైవేట్ సెక్టార్‌లో ఉపాధి కల్పిస్తారన్నారు. పెద్దగంట్యాడలోని నేక్ సెంటర్లో శిక్షణ అందిస్తామని తెలిపారు.
News March 27, 2025
MBNR: హిందూ, ముస్లిం భాయీ.. భాయీ❤

మత సామరస్యానికి ఆ ఊరు ప్రతీకగా నిలుస్తోంది. కులం, మతం కంటే మానవత్వమే ముఖ్యమంటూ దశాబ్దాలుగా పండగలన్నీ అంతా కలిసే నిర్వహిస్తారు. రంజాన్‌లో ఇఫ్తార్ విందుతోపాటు హిందూ, క్రైస్తవ మతాల పండగలనూ అంతా కలిసి జరుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మైనారిటీ స్టార్ యూత్, అంబేడ్కర్, వివేకానంద యువజన సంఘాల ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ ఊరే మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచేడ్ గ్రామం.
News March 27, 2025
అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం: స్వామి

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో అంగన్వాడీ వర్కర్లతో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఖాళీలను గుర్తించి పోస్టులను భర్తీ చేస్తానన్నారు.