News May 13, 2024
MBNR: నేడే ఎంపీ ఎన్నికల ఓటింగ్.!

నేడు నిర్వహిస్తున్న పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న MBNR, NGKL పార్లమెంట్ స్థానాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అనేక మార్గాల ద్వారా ఓటు హక్కు వినియోగం, ప్రాముఖ్యతను ఎన్నికల సంఘం ఓటర్లకు అవగాహన కల్పించింది. కాగా.. నేడు ఉమ్మడి జిల్లాలో 34 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Similar News
News December 17, 2025
MBNR జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే.!

పాలమూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, తొలి ఫలితం వెలువడింది. భూత్పూర్ మండలం లంబాడికుంట తండా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాన్య నాయక్ ఘనవిజయం సాధించారు. BRS మద్దతుతో పోటీ చేసిన ఆయన, ప్రత్యర్థులపై ఆధిక్యం కనబరిచి విజేతగా నిలిచారు. జిల్లాలో వెలువడిన మొదటి ఫలితం ఇదే కాగా అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. గ్రామంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.
News December 17, 2025
MBNR జిల్లాలో 81.44 శాతం ఓటింగ్.. లెక్కింపు ప్రారంభం

MBNR జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి జిల్లా వ్యాప్తంగా 81.44 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,16,379 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ముగిశాయి. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సా.5 గంటల వరకు ఫలితాలు వెలువడనున్నాయి.
News December 17, 2025
మహబూబ్‌నగర్‌లో 25% ఓటింగ్ నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు మండలాల్లో మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 25 శాతం ఓటింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తం 1,42,909 మంది ఓటర్లకు గాను 36,232 మంది తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకున్నారు. ఓటర్ల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.


