News April 4, 2024

MBNR: పచ్చటి అడవి మధ్యలో వెలసిన ఆలయం

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి నవాబ్ పేట మండల కేంద్రానికి మార్గ మధ్యంలో 9 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో వెలసిన పర్వతాపూర్ మైసమ్మ దేవాలయం ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచినది. కొత్త వాహనం తెచ్చినా, ఎన్నికల ప్రచారాలు ఈ ఆలయం నుండి పూజలు చేసి ప్రారంభించడం ఆనవాయితీ. ఆది, మంగళవారాలు వేల సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని దర్శించుకుని బోనాలు సమర్పిస్తారు.

Similar News

News February 14, 2026

MBNR: లెక్కింపు ప్రక్రియ విజయవంతం: ఎస్పీ

image

పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిందని ఎస్పీ జానకి తెలిపారు. లెక్కింపు కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందన్నారు. వారం రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News February 14, 2026

MBNR: మున్సిపల్ ఎన్నికలు.. మహిళా అభ్యర్థుల విజయకేతనం

image

మహబూబ్‌నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. జిల్లాలోని రెండు పురపాలికలు, ఒక నగరపాలికలో జరిగిన ఎన్నికల్లో 32 మందికి పైగా మహిళలు విజయం సాధించి తమ సత్తా చాటారు. దేవరకద్ర, భూత్పూర్, మహబూబ్‌నగర్‌లలో మహిళల అఖండ విజయాలు రాజకీయాల్లో మారుతున్న ట్రెండ్‌కు, వారి ఉత్తేజానికి నిదర్శనంగా నిలిచాయి.

News February 14, 2026

మహబూబ్‌నగర్‌‌లో రీకౌంటింగ్..!

image

మహబూబ్‌నగర్ మేయర్ పీఠం ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లలో పోలింగ్ జరిగింది. 58వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించారు. 59 స్థానాల్లో కాంగ్రెస్-29, BRS-15, BJP-7, ఇతరులు 8 మంది విజయం సాధించారు. అయితే 53వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థిపై 29 ఓట్ల మెజార్టీ రాగా.. అక్కడ రీకౌంటింగ్ జరుగుతోంది.