News March 19, 2024
MBNR: పార్టీల బలాబలాలు తారుమారు.. !
MBNR ఎమ్మెల్సీ ఉపఎన్నిక నేపథ్యంలో పార్టీల బలాబలాలు తారుమారు అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 1439 ఓట్లు ఉండగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు 800 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పలువురు ఎంపీటీసీలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. దీంతో పార్టీల బలాబలాలు పూర్తిగా మారిపోతున్నాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని జిల్లాలో చర్చ సాగుతోంది.
Similar News
News September 10, 2024
శ్వేతారెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యేలు
జడ్చర్ల మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి సతీమణి గత రాత్రి అనారోగ్యంతో చెన్నైలో మరణించింది. ఆమె భౌతిక దేహాన్నినాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి MBNR జిల్లా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, జనంపల్లి అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి వాకటి శ్రీహరి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
News September 10, 2024
లక్ష్మారెడ్డి సతీమణి మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
మాజీ మంత్రి, BRS మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి(60) సోమవారం రాత్రి మృతిచెందారు. కాగా శ్వేతా మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. లక్ష్మారెడ్డికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియలకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించారు.
News September 10, 2024
MBNR: మరణంలోనూ వీడని స్నేహం
షాద్‌నగర్ సమీపంలోని ఎలికట్ట శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. కొందర్గు మండలానికి చెందిన కరుణాకర్, శేఖర్ ప్రాణ స్నేహితులు. వీరు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు షాద్‌నగర్‌లో కలుసుకున్నారు. మద్యం సేవించి బైక్‌పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.