News September 24, 2024

MBNR: ప్రవేశాలు పొందేందుకు గడువు పెంపు

image

MBNR: జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులకు ఇంటర్ బోర్డ్ మరోసారి గడు పొడిగిస్తూ అవకాశం ఇచ్చింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను.. ఈ నెల 30 వరకు గడువు పొడిగిస్తూ అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అపరాధ రుసుము లేకుండా.. ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో రూ.500 అపరాధ రుసుముతో ప్రవేశాలు పొందవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News October 12, 2024

కొండారెడ్డిపల్లికి చేరుకనన్న సీఎం రేవంత్ రెడ్డి

image

వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. దసరా సందర్భంగా స్వగ్రామానికి వచ్చిన సీఎంకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వాకిటి శ్రీహరి, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. గ్రామస్థులు బోనాలు, బతుమ్మలు, కోలాటాలతో స్వాగతం పలికారు. సీఎం రాకతో కొండారెడ్డిపల్లికో పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.

News October 12, 2024

పాలపిట్ట, జమ్మి పత్రాల ప్రత్యేకత ఇదే..

image

దసరా పండుగ సందర్భంగా జమ్మి పత్రాలకు, పాలపిట్టకు చాలా ప్రత్యేకత ఉందని పండితులు అంటున్నారు. జమ్మి పత్రాలకు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఒకరికి ఒకరు పుచ్చుకొని అలైబలై చేసుకోవడం ద్వారా శత్రుత్వం కోల్పోతుందన్నారు. పాలపిట్టను చూడడం ద్వారా అపజయాలు కోల్పోయి విజయాలు దరిచేరుతాయని, పల్లెల్లో ప్రజలు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని పొలాల వెంబడి వెళ్లి పాలపిట్టను చూస్తారని పండితులు తెలిపారు.

News October 12, 2024

పోలీసుల ఆధీనంలో కొండారెడ్డిపల్లి

image

రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వస్తుండగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం సొంత ఇంటి దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుచేశారు. గ్రామానికి చేరుకున్న సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అనంతరం గ్రామస్థులతో కలిసి జమ్మిపూజలో పాల్గొంటారు. రాత్రి వరకు సీఎం ఊరిలోనే గడపనున్నట్లు సమాచారం.