News August 20, 2025
MBNR: బీ-ఫార్మసీ ఫలితాలు.. UPDATE

పాలమూరు విశ్వవిద్యాలయంలో బీ-ఫార్మసీ 8వ సెమిస్టర్ రెగ్యులర్, 1, 3, 5,&7 బ్యాక్ లాక్ పరీక్ష ఫలితాలను బుధవారం యూనివర్సిటీ ఉపకులపతి(VC) ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ విడుదల చేశారు.
✒8th సెమిస్టర్ రెగ్యులర్-82.74% పాస్
✒7th సెమిస్టర్ బ్యాక్ లాక్-71.43% పాస్
✒5th సెమిస్టర్ బ్యాక్ లాక్-50% పాస్
✒3rd సెమిస్టర్ బ్యాక్ లాక్-54.55% పాస్
✒1st సెమిస్టర్ బ్యాక్ లాక్-58.33% పాస్
Similar News
News January 20, 2026
బోరాబండలో దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

HYDలో బోరాబండ రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన భార్య రొడ్డె సరస్వతి (32)ని భర్త రొడ్డె ఆంజనేయులు రోకలి బండతో దాడి చేసి హతమార్చాడు. భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తుందని ఆంజనేయులు అనుమానిస్తూ తరచూ గొడవ పడేవాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
News January 20, 2026
స్టార్ హోటళ్లు-రిసార్టులతో విశాఖకు కొత్త మెరుపు

విశాఖలో రూ.1552 కోట్లతో 10 హోటళ్లు, రిసార్టులు నిర్మాణం కానున్నాయి. ఇవి పూర్తిస్థాయిలో ప్రారంభమైతే సుమారు 1500 గదులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఐటిసీ రూ.328 కోట్ల పెట్టుబడులతో హోటల్ ప్రాజెక్టును చేపడుతోంది. అలాగే అన్నవరం బీచ్, విమానాశ్రయానికి సమీప ప్రాంతంలో Oberoi Hotels & Resorts,7-స్టార్ లగ్జరీ రిసార్ట్ & హోటల్ ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తోంది. వరుణ్ గ్రూపు కూడా హోటల్ నిర్మిస్తోంది.
News January 20, 2026
ఖమ్మం: ఇంటర్ పరీక్షలకు సిద్ధం.. 66 కేంద్రాల ఏర్పాటు

ఖమ్మం జిల్లాలో ఫిబ్రవరి 25 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు యంత్రాంగం సిద్ధమైంది. మొత్తం 35,188 మంది విద్యార్థుల కోసం 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 2నుంచి ప్రాక్టికల్స్ ప్రారంభం కానున్నాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షించి, కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు DIEO రవిబాబు తెలిపారు.


