News March 28, 2024

MBNR: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వేళాయె!

image

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేడు జరగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో సెక్టార్, రూట్ అధికారులు, పీవో, ఏపీవోలు కలిపి మొత్తం 450 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికకు ఎన్నికల పరిశీలకురాలిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ శాస్త్ర, సాంకేతికశాఖ ముఖ్యకార్యదర్శి వాణి ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.

Similar News

News February 14, 2026

మహబూబ్‌నగర్‌‌లో రీకౌంటింగ్..!

image

మహబూబ్‌నగర్ మేయర్ పీఠం ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లలో పోలింగ్ జరిగింది. 58వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించారు. 59 స్థానాల్లో కాంగ్రెస్-29, BRS-15, BJP-7, ఇతరులు 8 మంది విజయం సాధించారు. అయితే 53వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థిపై 29 ఓట్ల మెజార్టీ రాగా.. అక్కడ రీకౌంటింగ్ జరుగుతోంది.

News February 13, 2026

మహబూబ్‌నగర్‌లో కౌంటింగ్‌ ఆలస్యం.. కారణం ఏంటో?

image

మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌లో చాలా ఆలస్యం అవుతుంది. దీంతో కౌంటింగ్ కేంద్రం బయట కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కౌంటింగ్ కేంద్రం లోపల ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికి 1-30 డివిజన్‌ల ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా 31-60 డివిజన్‌ల ఫలితాలు రావాల్సి ఉంది. ఎవరు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News February 13, 2026

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ ముందంజ

image

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 60 స్థానాలకు గాను 30 డివిజన్లకు లెక్కింపు పూర్తయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో, బీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతుంది.