News May 3, 2024
MBNR: మీ అభ్యర్థి వివరాలు తెలుసుకోండి ఇలా!

లోక్ సభ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులు బరిలో నిలిచారన్నది చాలామందికి తెలియదు. ఎవరెవరు పోటీ చేస్తున్నారో కేవైసీ(నో యువర్ క్యాండిడేట్) యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా పోటీ చేసే అభ్యర్థి విద్యార్హతలు, వారికి నేర చరిత్ర ఉందా, ఎక్కడెక్కడ ఎంత మేర ఆస్తులు ఉన్నాయి. స్థిర, చర ఆస్తులు, ఇతర వివరాలన్నీ ఇందులో ఉంటాయి. దీన్ని బట్టి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.
Similar News
News December 17, 2025
MBNR: నేడు 122 సర్పంచ్‌లు, 914 వార్డులకు ఎన్నికలు

మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత ఎన్నికల నేపథ్యంలో మొత్తం 133 జీపీలు,1152 వార్డ్ సభ్యులకు గాను 10 సర్పంచ్ లు,231 వార్డ్‌లు ఏకగ్రీవం. జడ్చర్ల(M)లో ఒక జీరో నామినేషన్, 7 వార్డ్ సభ్యులకు జీరో నామినేషన్ పోను 122 సర్పంచ్‌లు, 914 వార్డ్ సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌లకు ఏకగ్రీవంతో కలిపి 440 మంది అభ్యర్థులు, వార్డ్ సభ్యులు 2,584 మంది పోటీలో ఉన్నారని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.
News December 17, 2025
MBNR:‘ఇన్నోవేషన్ పంచాయత్’.. రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇలా!

తెలంగాణ ఇన్నోవేషన్ సెల్(టీజీఐసీ ) తెలంగాణలోని ఆవిష్కర్తలను, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘ఇన్నోవేషన్ పంచాయత్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.https://forms.gle/Av75xS4UUGRNKLpx8 ఫార్మ్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT.
News December 17, 2025
MBNR: ఫేస్-3 సర్పంచ్ ఎన్నికలు..UPDATE

మహబూబ్ నగర్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
✒133 రిటర్నింగ్ అధికారులు,13 రిజర్వ్ తో కలిపి మొత్తం 146 మంది రిటర్నింగ్ అధికారులు
✒1152 పోలింగ్ కేంద్రాలకు రిజర్వ్ తో కలిపి 1551 బ్యాలెట్ బాక్స్ లు
✒28 జోన్లకు రిజర్వ్ తో కలిపి 32 మంది జోనల్ అధికారులు
✒20 శాతం రిజర్వ్ తో కలిపి 3005 మంది పి.ఓ.లు, ఓ.పి.ఓ.లు
✒పి.ఓ.లు 2310, ఓ.పి. ఓ.లు 3386 మంది అందుబాటులో ఉన్నారు.


