News March 24, 2024

MBNR: వారం రోజుల్లో ఖర్చు చేయకుంటే నిధులు వెనక్కే !

image

ఉమ్మడి జిల్లాలో 3,068కి పైగా ప్రభుత్వ పాఠశాలలు, 55 ఎమ్మార్సీలు, 208 సీఆర్సీలున్నాయి. వీటికి మొదటి విడతలో రూ.5.54 కోట్లు, రెండో విడతగా రూ.5.54 కోట్ల నిధులు వచ్చాయి. ఈ నిధులను వారం రోజుల్లో మార్చి 31 నాటికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. లేదంటే వెనక్కి వెళ్లిపోతాయి. స్టేషనరీ, పాఠశాల మరమ్మతులు, రంగులు వేయడానికి, ప్రయోగాలు, ఆటలు ఆడించేందుకు తదితర వాటి కోసం నిధులను ఉపయోగించి బిల్లులు అప్ లోడ్ చేయాల్సి ఉంది.

Similar News

News December 10, 2025

MBNR: పల్లె బాట పట్టిన పట్టణవాసులు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో రేపు గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదు, ముంబై వలస వెళ్లిన కార్మికులు తిరిగి తమ సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులలో రద్దీ గణనీయంగా పెరిగింది. కొందరు సొంత వాహనాలతో తమ గ్రామాలకు బయలుదేరి వెళుతున్నారు. దీంతో 44వ జాతీయ రహదారి రద్దీగా మారింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.

News December 10, 2025

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి: ఎస్పీ

image

నిష్పక్షపాతంగా ప్రతి అధికారి విధులు నిర్వహించాలని ఎస్పీ జానకి బుధవారం సూచించారు. రేపు మొదటి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. వికలాంగులకు సహాయ సహకారాలు అందించాలని, ఎల్లప్పుడూ ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ ఉండాలని సూచించారు.

News December 10, 2025

మహబూబ్‌నగర్‌లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. గండీడ్ మండలం సల్కర్‌పేటలో అత్యల్పంగా 9.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిడ్జిల్ మండలం దోనూరులో 9.3, మిడ్జిల్‌లో 10.1, కోయిలకొండ సిరి వెంకటాపురం, భూత్‌పూర్‌లో 10.5, దేవరకద్రలో 10.9, కొత్త మొల్గ‌రలో 11.4, జానంపేటలో 11.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.